ఎన్టీఆర్ రికార్డ్ బద్దలు కొట్టిన అల్లు అర్జున్.. ఈ ఘనత సాధించిన మొదటి తెలుగు హీరో.!
అల్లు అర్జున్.. తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోల్లో ఒకడు. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తెరకెక్కించిన 'గంగోత్రి' అనే సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయిన ఈ మెగా కాంపౌండ్ హీరో.. కెరీర్ ఆరంభంలోనే కొన్ని విజయాలను దక్కించుకున్నాడు. అంతేకాదు.. డ్యాన్స్, స్టైల్స్‌లో కొత్తదనం చూపిస్తూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఈ క్రమంలోనే వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. తాజాగా అల్లు అర్జున్ ఓ అరుదైన రికార్డును క్రియేట్ చేశాడు. ఫలితంగా ఎన్టీఆర్‌ను వెనక్కి నెట్టాడు. ఆ సంగతులేంటో చూద్దాం పదండి.!

అల్లు అర్జున్ ఖాతాలో ఇండస్ట్రీ హిట్
ఈ సంక్రాంతికి అల్లు అర్జున్ ‘అల.. వైకుంఠపురములో' అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ అవడంతో పాటు భారీ స్థాయిలో కలెక్షన్లను రాబట్టింది. ఫలితంగా ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్. ఎస్ ఎస్ థమన్ సంగీతం అందించాడు.

చాలా గ్యాప్ తర్వాత అతడితో బన్నీ
కెరీర్ తొలినాళ్లలో ‘ఆర్య' అనే సినిమా ద్వారా బన్నీకి బంపర్ హిట్ అందించాడు లెక్కల మాస్టార్ కమ్ డైరెక్టర్ సుకుమార్. ‘గంగోత్రి'లో నూనూగు మీసాల కుర్రాడిలా కనిపించిన అతడు.. ఇందులో సరికొత్తగా దర్శనమిచ్చాడు. ఆ తర్వాత వీళ్లిద్దరి కాంబినేషన్‌లో ‘ఆర్య2' కూడా వచ్చింది. ఈ సినిమా వచ్చిన పదేళ్ల తర్వాత అంటే ఇప్పుడు బన్నీ - సుకుమార్ కాంబో రిపీట్ కాబోతుంది.

ఊరమాస్ ‘పుష్ప’గా అల్లు అర్జున్
ఎంతో ప్రతిష్టాత్మంగా రాబోతున్న ఈ సినిమాకు ‘పుష్ప' అనే టైటిల్ ఫిక్స్ చేసింది చిత్ర యూనిట్. అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా టైటిల్‌తో పాటు బన్నీ లుక్‌ను కూడా రివీల్ చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా చేస్తోంది. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. బన్నీ లేకుండానే ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ పూర్తయింది.

స్పెషల్ అట్రాక్షన్.. ఫుల్ రెస్పాన్స్
బుధవారం విడుదలైన ‘పుష్ప' ఫస్ట్ లుక్ పోస్టర్లకు భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. ఒక దానిలో బన్నీ లుక్‌ను మాత్రమే చూపించిన సుకుమార్.. రెండో పోస్టర్‌లో మాత్రం గంధపు చెక్కలు స్మగ్లింగ్ చేస్తుండగా పట్టుబడినట్లు చూపించాడు. అంతేకాదు, ఆ పోస్టర్‌లో బన్నీ కాలికి ఆరు వేళ్లు ఉండడం హాట్ టాపిక్ అవుతోంది. అలాగే, టైటిల్‌పై ఉన్న వేలిముద్రలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

టాలీవుడ్ రికార్డ్ క్రియేట్ చేసిన స్టైలిష్ స్టార్
ఊరమాస్ లుక్‌లో దర్శనమిస్తున్న బన్నీ పోస్టర్లకు ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రియుల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. ఫలితంగా ట్విట్టర్‌లో అత్యధిక లైకులు సాధించిన పోస్టర్‌గా ‘పుష్ప' నిలిచింది. దీంతో టాలీవుడ్‌లో సరికొత్త రికార్డును క్రియేట్ చేశాడు స్టైలిష్ స్టార్. గతంలో ‘అల.. వైకుంఠపురములో' పాటలతో కూడా అతడు ఎన్నో రికార్డులు బద్దలు కొట్టిన విషయం తెలిసిందే.
Recommended Video

ఎన్టీఆర్ రికార్డ్ బద్దలు కొట్టిన అల్లు అర్జున్
తాజాగా అల్లు అర్జున్.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ రికార్డును బద్దలు కొట్టాడు. త్రివిక్రమ్ దర్శకత్వంలో అతడు నటించిన ‘అరవింద సమేత.. వీరరాఘవ' ఫస్ట్ లుక్ పోస్టర్‌కు 70.20K లైక్స్ రాగా.. బన్నీ పోస్టర్‌కు ఏకంగా 84.1K లైకులు వచ్చాయి. వీళ్లిద్దరి తర్వాత ఈ జాబితాలో మహేశ్ బాబు నటించిన ‘మహర్షి' నిలిచింది. ఆ మూవీ పోస్టర్‌కు 67.2K లైకులు వచ్చాయి.


Click it and Unblock the Notifications











