twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మరో వివాదంలో అల్లు అర్జున్.. సౌత్ సినిమా మీద సెటైర్ మిస్ ఫైర్ అయిందిగా!

    |

    ఒకపక్క పుష్ప సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న అల్లు అర్జున అనుకోకుండా వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు. సినిమాలో ఆయన చేసిన పుష్పరాజ్ పాత్ర స్మగ్లర్ పాత్ర కావడంతో సినిమా విడుదలైన నెల తరువాత ఆయనని విమర్శిస్తుంటే ఇప్పుడు అనుకోకుండా ఒక యాడ్ కారణంగా మరో వివాదంలో చిక్కుకున్నారు. ఆ వివరాలు..

    క్యాష్ చేసుకుంటూ

    క్యాష్ చేసుకుంటూ

    సాధారణంగా సినీ ఇండస్ట్రీలో క్రేజ్ ఉన్న హీరో హీరోయిన్ లను తమ తమ బ్రాండ్లకు అంబాసిడర్ గా నియమించుకోవడం కంపెనీలకు అలవాటు. నాటి చిరంజీవి నుంచి నేటి చరణ్ వరకు ఇది సాధారణ విషయమే. అయితే కాస్త క్రేజ్ ఉన్న అందరూ ఈ విషయాన్ని క్యాష్ చేసుకుంటూ ఉంటారు.

    బ్రాండ్ కు యాడ్ చేసి

    బ్రాండ్ కు యాడ్ చేసి

    అయితే అల్లు అర్జున్ తన సొంత బ్రాండ్ ను క్రియేట్ చేసుకునే పనిలో ఉండడమే కాక అనేక ఎన్నో ఇతర బ్రాండ్స్ కు అంబాసిడర్ గా కూడా వ్యవహరించారు. ఇక పుష్ప పాన్ ఇండియా చిత్రం ద్వారా ఉత్తరాది రాష్ట్రాలలో ప్రేక్షకులను సందడి చేసిన ఆయన ఆ సినిమా విడుదల ముందు ఒక బ్రాండ్ కు యాడ్ చేసి చిక్కుల్లో పడ్డారు.

    రాపిడో బైక్

    రాపిడో బైక్

    గతంలో బన్నీ రాపిడో బైక్ ను పొగుడుతూ ఆర్టీసీని కించపరుస్తూ చేసిన ఒక యాడ్ తీవ్ర వివాదానికి దారి తీసింది. ఈ విషయం మీద తెలంగాణ ఆర్టీసీ ఎండి సజ్జనార్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో పాటు కోర్టును ఆశ్రయించడంతో ఆ యాడ్ ను నిలిపివేయాల్సి వచ్చింది. అది ముగిసింది అనుకున్న కొన్ని రోజులకు ఇప్పుడు మరో వివాదంలో చిక్కుకున్నారు.

    జొమాటో కి

    జొమాటో కి

    అదేమిటి అంటే ప్రముఖ ఫుడ్ సంస్థ అయిన జొమాటో కి అల్లు అర్జున్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే జొమాటో కోసం అల్లు అర్జున్ ఒక యాడ్ చేయగా దాన్ని ఇప్పుడు విడుదల చేశారు. ఈ యాడ్ లో భాగంగా అల్లు అర్జున్ నటుడు సుబ్బరాజుతో ఫైట్ చేస్తూ ఆయనని కొడతాడు. దీంతో సుబ్బరాజు గాల్లో తేలతాడు. అలా గాల్లో తేలుతున్న సుబ్బరాజు, నన్ను తొందరగా కిందకి దించూ... నేను గోంగూర మటన్ తినాలి లేదంటే హోటల్ మూసేస్తారు అని అడుగుతారు.

     ఎక్కువసేపు ఎగరాలి

    ఎక్కువసేపు ఎగరాలి

    దానికి బన్నీ ఇది సౌత్ సినిమా కదా గాల్లో ఎక్కువసేపు ఎగరాలి అంటూ ఎప్పుడు ఏం కావాలన్నా జొమాటో ఉందిగా అని చెప్తాడు. 'ఏం కావాలన్నా.ఎప్పుడు కావాలన్నా జొమాటో అందిస్తుంది సూపర్ ఫాస్ట్‌గా. మనసు కోరితే తగ్గేదేలే' అంటూ పుష్ప స్టైల్లో బన్నీ చెప్పడంతో యాడ్ ముగుస్తుంది. అయితే ఈ యాడ్ న ఆయన అభిమానులు ఇంజను చేస్తుంటే సౌత్ సినీ లవర్స్ ఏమో అల్లు అర్జున్ వీడియో పై విమర్శలు చేస్తున్నారు.

     ఎలా చేయగలిగారు

    ఎలా చేయగలిగారు

    మామూలుగానే సౌత్ అంటే నార్త్ వాళ్లకు చిన్నచూపు ఉంటుంది. వాళ్ళు మనల్ని హేళన చేస్తూ ఉంటారు, అలాంటిది బాహుబలి, పుష్ప లాంటి సినిమాలతో వాళ్లకు సరైన సమాధానం చెబుతున్నా ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీని చిన్నబుచ్చే విధంగా కామెంట్ ఎలా చేయగలిగారు అంటూ ప్రశ్నిస్తున్నారు. పెద్ద ఎత్తున నెటిజన్లు కామెంట్స్ చేస్తూ ఉండడంతో అల్లు అర్జున్ ఎలా స్పందిస్తారో చూడాలి.

    English summary
    Allu Arjun’s Satire on South Film Industry in Zomato ad miss fired
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X