Pushpa 2 డైలాగ్‌ను లీక్ చేసిన అల్లు అర్జున్.. తగ్గేదే లే మించి పవర్‌ఫుల్‌గా!

ఊర్వశివో రాక్షసివో సినిమా సక్సెస్ మీట్‌కు వచ్చిన వారందరికి, మీడియాకు థ్యాంక్స్. ఈ సినిమాను ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు మనస్పూర్తిగా ధన్యవాదాలు. థ్యాంక్యూ సో మచ్.. ఈ సినిమాకు మాకు చాలా స్పెషల్ ఫిలిమ్. మాకు, మా నాన్నకు, మా ఫ్యామిలీకి పాజిటివ్ ఫిలిం. మాకు ఈ ఆనందాన్ని ఇచ్చినందకు మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకొంటున్నాను. ఊర్వశివో రాక్షసివో సినిమా యూనిట్ అందరికి కంగ్రాట్స్ అని అల్లు అర్జున్ అన్నారు. ఊర్వశివో రాక్షసివో సక్సెస్ మీట్‌లో మాట్లాడుతూ..

క్రెడిట్ అంతా డైరెక్టర్‌కే

క్రెడిట్ అంతా డైరెక్టర్‌కే


ఊర్వశివో రాక్షసివో సినిమా విజయంలో ముందుకు డైరెక్టర్‌కు క్రెడిట్ ఇస్తాను. ఎందుకంటే.. అందరికి లైఫ్ ఇచ్చేది ఆయనే. ఇంటిలో వెలుగును నింపే ఎలక్ట్రిసిటీలా డైరెక్టర్‌కు పవర్ ఉంటుంది. ఇంత మెమొరబుల్ సినిమాను ఇచ్చినందుకు బిగ్ కంగ్రాట్స్. ఈ సినిమా క్రెడిట్‌లో నా తండ్రి అల్లు అరవింద్‌కు కంగ్రాట్స్. నా కెరీర్‌లో సినిమాలను చూశారు. కానీ శిరీష్ సినిమాను మరోసారి చూశారు. ఈ సినిమాను నిర్మించినందుకు బిగ్ థ్యాంక్స్ అని అన్నారు.

బన్నీ అంటే వాసు.. వాసు అంటే..

బన్నీ అంటే వాసు.. వాసు అంటే..


జీఏ2 బ్యానర్‌ను పెట్టిన బన్నీ వాసు అంటే.. నాకు చాలా ఇష్టం.. బన్నీ అంటే వాసు. .వాసు అంటే బన్నీ.. ఇంతకంటే.. నేను ఎక్కువ చెప్పలేను. గీతా ఆర్ట్స్‌లో నేను సినిమా చేస్తే నా రెమ్యునరేషన్ విషయంలో మా నాన్న ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు. కానీ బన్నీ వాసు నాతో సినిమా చేస్తే.. ఎక్కువగానే ఇస్తాడు. ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహిరంచిన ధీరజ్‌కు కంగ్రాట్స్ అని అల్లు అర్జున్ అన్నారు.

లవర్ ఆల్సో.. ఫైటర్ ఆల్సో అంటూ

లవర్ ఆల్సో.. ఫైటర్ ఆల్సో అంటూ


ఊర్వశివో రాక్షసివో సినిమాలో నటించిన అను ఇమ్మాన్యుయేల్ గతంలో ఐయామ్ లవర్ ఆల్సో.. ఫైటర్ ఆల్సో అంది.. ఇప్పుడు ఊర్వశివో రాక్షసివో అంటున్నది. ఇలాంటి సినిమా చేయడం ఏ అమ్మాయికైనా చాలా కష్టం. కానీ నీవు ఇలాంటి రిస్క్ తీసుకొన్నందుకు కంగ్రాట్స్ అని అల్లు అర్జున్ అన్నారు.

హిట్ కొట్టినా.. కొట్టకపోయినా శిరీష్‌ అంటే ఇష్టం

హిట్ కొట్టినా.. కొట్టకపోయినా శిరీష్‌ అంటే ఇష్టం


ఇక చివరగా నేను శిరీష్ గురించి చెప్పాలి. ఇలాంటి రోజు కోసం చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను. సినిమాకు ముందు మాట్లాడితే.. తమ్ముడి కోసం మాట్లాడినట్టు అనుకొంటారు. అందుకే సినిమా సక్సెస్ తర్వాత మాట్లాడాలని అనుకొన్నాను. ఈ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా..గౌరవాన్ని పొందారు. నీవు సక్సెస్ కొట్టకపోయినా.. కొట్టినా.. నీవంటే నాకు ఇష్టమే. నీవు జీవితాన్ని ముందుకు తీసుకుపోయే విధానం చూస్తే నాకు మరింత గౌరవం ఏర్పడింది. శిరీష్ ఫెర్ఫార్మెన్స్ బాగుందని అంటే..నాకు చాలా హ్యాపీగా ఉంది.ఈ సినిమాతో మరింత కెరీర్ పరంగా ముందుకు వెళ్లాలని కోరుకొంటున్నాను.ఈ సినిమాతో అమ్మాయిల్లో శిరీష్‌కు నాకంటే రొమాంటిక్‌గా మంచి క్రేజ్ ఏర్పడుతుంది.

పుష్ప 2 డైలాగ్‌ను లీక్ చేసిన అల్లు అర్జున్

పుష్ప 2 డైలాగ్‌ను లీక్ చేసిన అల్లు అర్జున్


నా అభిమానుల పుష్ప 2 అప్‌డేట్.. గురించి వెయిట్ చేస్తున్నారని నాకు తెలుసు. పుష్ప సినిమాలో తగ్గేదే లే అని అన్నాను. పుష్ప 2 మూవీలో అస్సలే తగ్గదే లే.. డైలాగ్ మరింత పాపులర్ అవుతుంది. ఈ డైలాగ్ పాజిటివ్‌గా ఉంటుందని అనుకొంటున్నాను. మీకు కూడా కనెక్ట్ అవుతుందని ఆశిస్తున్నాను అని అల్లు అర్జున్ అన్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X