ప్రభాస్ బర్త్ డే: అల్లు అర్జున్, సాయిధరమ్ ఎమోషనల్ ట్వీట్స్.. నిన్ను కలిసిన క్షణం.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ జన్మదినం రోజున సోషల్ మీడియాలో శుభాకాంక్షల వెల్లువ కొనసాగుతున్నది. ప్రభాస్‌తో ఉన్న అనుబంధాన్ని పలువురు సోషల్ మీడియా ద్వారా పంచుకొంటున్నారు. తాజాగా అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్, నిల్ నితిన్ ముఖేష్, సంపత్ నంది, కల్యాణి ప్రియదర్శన్ తదితరులు ప్రభాస్‌కు బర్త్ డే విషెస్ అందించారు. బన్నీ, సాయిధరమ్ భావోద్వేగంతో చేసిన ట్వీట్లు అభిమానులను ఆకట్టుకొంటున్నాయి.
ఈ తరం హీరోలలో
ప్రభాస్ అన్న నీకు జన్మదిన శుభాకాంక్షలు. ఈ తరం హీరోల్లో నీ అంత నిజాయితీగా, ఒదిగి ఉండేవారిలో మీరు ఒకరు అని ప్రభాస్‌కు మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ ట్వీట్ చేశారు.
నిన్ను కలిసిన క్షణం నుంచి
మరెన్నో జన్మదినాలు నీవు జరుపుకోవాలి. నా డియరెస్ట్ డార్లింగ్ ప్రభాస్‌కు జన్మదిన శుభాకాంక్షలు. నిన్ను కలిసిన మరుక్షణం నుంచి నీపై ఉన్న ప్రేమ, అభిమానం అలానే ఉంది. నీవు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. మరింత ప్రేమను, విజయాన్ని పొందాలి అని అల్లు అర్జున్ ట్వీట్ చేశారు.
దేవుడు చల్లగా చూడాలి
రెబెల్ స్టార్ ప్రభాస్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. మిమ్మల్ని దేవుడు చల్లగా చూడాలి. భవిష్యత్‌లో మరిన్ని పేరు ప్రఖ్యాతులు సంపాదించాలి అని హలో సినిమా హీరోయిన్ కల్యాణి ప్రియదర్శన్ ట్వీట్ చేసింది.
నిజమైన జెంటిల్మన్..
ప్రభాస్ సరసన సాహో చిత్రంలో విలన్‌గా నటిస్తున్న బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముఖేష్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. డార్లింగ్ ప్రభాస్‌కు హ్యాపీ బర్త్ డే. నిజమైన జంటిల్మెన్, రాక్‌స్టార్. ఎప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకొంటున్నాను అని నీల్ నితిన్ ట్వీట్‌లో పేర్కొన్నారు.
మంచి హృదయం ఉన్న డార్లింగ్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌కు ప్రముఖ దర్శకుడు సంపత్ నంది జన్మదిన శుభాకాంక్షలు అందజేశారు. మంచి హృదయం ఉన్న డార్లింగ్. నిజాయితీ, నిస్వార్ధమైన వ్యక్తి. ఈ ప్రత్యేకమైన రోజు మీకు ఎప్పుడూ సంతోషాన్ని కలిగించేలా ఉండాలి అని సంపత్ నంది ట్వీట్‌లో వెల్లడించారు.


Click it and Unblock the Notifications











