మరో రికార్డు బద్దలు.. బాలీవుడ్ ప్రేక్షకులకు థ్యాంక్స్ చెప్పిన అల్లు అర్జున్.. ఎందుకో తెలుసా..?
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. తెలుగులో స్టార్ హీరోగా వెలుగొందుతున్నాడు. ఎంతో మంది యంగ్ హీరోలకు సవాల్ చేస్తూ టాప్ పొజిషన్ కోసం పోటీ పడుతున్నాడు. డ్యాన్స్, డైలాగ్స్, ఫైట్స్‌లో సత్తా చాటే అల్లు అర్జున్‌కు భారీ ఫ్యాన్ ఫాలోయింగే ఉంది. తెలుగులోనే కాదు.. అతడి ప్రతి సినిమానూ కేరళలో కూడా విడుదల చేస్తుంటారు. మలయాళీలు బన్నీని తమ ఇండస్ట్రీ హీరోగా ట్రీట్ చేస్తుంటారు. అలాగే హిందీలోనూ ఆయనకు క్రేజ్ బాగానే ఉంది. ఈ క్రమంలోనే తాజాగా బన్నీ ఓ రికార్డును బద్దలు కొట్టాడు. వివరాల్లోకి వెళితే..

యూట్యూబ్ సెన్సేషన్
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ యూట్యూబ్‌లో రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తున్నాడు. గతంలో ఎన్నో సినిమాలు అక్కడ భారీ స్థాయిలో వ్యూస్ సాధించాయి. సినిమాల టీజర్లు, ట్రైలర్లకు విశేష స్పందన వచ్చింది. ఈ క్రమంలోనే తన హిందీ డబ్బింగ్ సినిమాలతో యూట్యూబ్‌లో దుమ్ము దులుపుతున్నాడు.

‘సరైనోడు', ‘డీజే' కూడా..
అల్లు అర్జున్ నటించిన ‘సరైనోడు' హిందీ వాళ్లకు తెగ నచ్చేసింది. ఆ మూవీకి కూడా 200 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. 6.18 లక్షల లైకులు వచ్చాయి. అలాగే, ‘డీజే' కూడా అత్యధిక వ్యూస్ సొంతం చేసుకుంది. ఆ మూవీ ఈ మధ్యనే 150 మిలియన్ వ్యూస్‌ను క్రాస్ చేసింది. అంతేకాదు, 4.9 లక్షల లైకులు వచ్చాయి. దీంతో వరుసగా రెండు సినిమాలకు యూట్యూబ్‌లో 150 మిలియన్లకుపైగా వ్యూస్ సంపాదించిన హీరోగా బన్నీ రికార్డులకెక్కాడు. దీంతో బన్నీ అభిమానులు ఖుషీ అయిపోతున్నారు.

హిందీలో మంచి ఫాలోయింగ్
బన్నీ సినిమాలకు హిందీలో కూడా మంచి ఫాలోయింగ్ ఉందని చెప్పడానికి ఇదే నిదర్శనం. అందుకే అతడి సినిమా హిందీ డబ్బింగ్ హక్కులకు భారీ డిమాండ్ ఉంటుంది. గతంలో కూడా కొన్ని సినిమాలు మంచి వ్యూస్ సాధించాయి. దీంతో నిర్మాతలు ఈ విధంగా కూడా క్యాష్ చేసుకుంటున్నారు. వీటితో పాటు మరికొన్ని చిత్రాలు కూడా భారీ వ్యూస్ సాధించాయి.
థ్యాంక్స్ చెప్పిన బన్నీ
తన సినిమాలు ‘సరైనోడు', ‘డీజే' వరుసగా 200, 150 మిలియన్ వ్యూస్ సాధించడంపై అల్లు అర్జున్ స్పందించాడు. ఈ మేరకు ట్విట్టర్‌లో ‘భాష పరమైన సరిహద్దులను దాటి మా సినిమాలను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. రాబోయే రోజుల్లో మిమ్మల్ని మరింత అలరించడంతో పాటు మీ ప్రేమను దక్కించుకునేందుకు కృష్టి చేస్తాను. మరొక్కసారి ధన్యవాదాలు' అంటూ పోస్ట్ చేశాడు.

ప్రస్తుతం చేస్తున్న సినిమా
‘జులాయి', ‘సన్నాఫ్ సత్యమూర్తి' వంటి సూపర్ హిట్ చిత్రాల తర్వాత అల్లు అర్జున్ - త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో మరో సినిమా వస్తున్న విషయం తెలిసిందే. గీతా ఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. సంక్రాంతి కానుకగా రాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.


Click it and Unblock the Notifications











