మకాం మారుస్తున్న అల్లు అర్జున్.. ఇక అక్కడి నుంచే ఐకాన్ స్టార్ ఎటాక్!
మెగా ఫ్యామిలీతో వివాదాలు పక్కన పెట్టి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్‌పై ఫోకస్ పెట్టారు. పుష్ప 2 సినిమాకు పాన్ ఇండియా లెవెల్‌లో భారీ బజ్ క్రియేట్ చేసేందుకు ప్లానింగ్ మొదలుపెట్టారు. అందుకోసం తన టీమ్‌ను బలోపేతం చేయడమే కాకుండా తన ప్రమోషన్స్, బ్రాండింగ్‌కు కార్పోరేట్ లుక్ తెచ్చేందుకు ప్రణాళికను సిద్దం చేసుకొంటున్నట్టు సమాచారం. ఈ మేరకు ఫిలింనగర్‌లో ఓ వార్త చక్కర్లు కొడుతున్నది. ఆ వివరాల్లోకి వెళితే..
అనేక ఊహగానాలు, అనుమానాల మధ్య పుష్ప 2 సినిమా రిలీజ్ డేట్‌ను ఇటీవల అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ ప్రకటించారు. ఎట్టి పరిస్థితుల్లోను డిసెంబర్ 6వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేస్తామని రూమర్లకు తెర దించారు. ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో ప్రతికూల పరిస్థితులు ఉండే అవకాశం కనిపించడంతో ఉత్తరాదిపైనే ఫోకస్ చేయాలని నిర్ణయించుకొన్నట్టు తెలుస్తున్నది.

ఇక పుష్ప 2 రిలీజ్‌కు ముందే అల్లు అర్జున్ తన ఆఫీస్ సెటప్‌ను పూర్తిగా మార్చి వేయాలని నిర్ణయం తీసుకొన్నారు. ప్రస్తుతం ఉంటున్న తన ఇళ్లు, ఆఫీస్‌ను నుంచి మరో చోటికి వెళ్లేందుకు ప్లాన్ చేశారు. ఈ మేరకు మాధాపూర్‌లోని ఓ ప్రాంతంలో భారీ సెటప్‌ను ఎంచుకొన్నారు అని ఫిలింనగర్‌లో ఓ వార్త వైరల్ అయింది.
జూబ్లీహిల్స్‌లోని వెంకటగిరి ప్రాంతంలో విలాసవంతమైన భవనాన్ని ఎంచుకొన్నారు. స్వర్గీయ కృష్ణంరాజు ఇంటికి సమీపంలోనే, ప్రస్తుతం మైత్రీ మూవీస్ ఆఫీస్‌కు పక్కనే విశాలమైన బిల్డింగ్‌ను సొంతం చేసుకొన్నారు. అక్కడే తన నివాసంతోపాటు ఆఫీస్ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తారు అని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.

తాజా సమాచారం ప్రకారం.. కొత్త ఇంటి వైశాల్యం సుమారుగా 3500 చదరపు అడుగుల్లో ఉంది. ఈ ఇంటిని విలాసవంతంగా, సకల సౌకర్యాలు, ఆధునిక వసతులు ఉండేలా ఐకాన్ స్టార్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికీ ఇంటీరియర్ డిజైన్ 70 శాతం పూర్తయింది. త్వరలోనే మంచి ముహుర్తం చూసుకొని గృహ ప్రవేశం చేస్తారు అని పేర్కొన్నారు.
తన నూతన గృహం, ఆఫీస్ నుంచే ఇక పుష్ప 2 సినిమా బాక్సాఫీస్‌ను పాన్ వరల్డ్ వైడ్‌గా ఎటాక్ చేస్తారు. ఇందుకోసం సరికొత్త స్ట్రాటెజీని అమలు చేయబోతున్నారు. అల్లు అర్జున్ తన బ్రాండ్ వ్యాల్యూ పెంచుకోనేలా.. కార్పోరేట్ హంగులు దిద్దుతున్నారు అనే విషయం మీడియాలో చర్చనీయాంశమైంది.


Click it and Unblock the Notifications











