భార్య స్నేహా రెడ్డిపై అల్లు అర్జున్ షాకింగ్ కామెంట్స్.. నేనంటే ఆమెకు ఇష్టం లేదంటూ!
తెలుగు చిత్ర పరిశ్రమలో సుదీర్ఘ కాలం పాటు హవాను చూపించి.. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్‌గా దూసుకుపోతోన్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్, స్టైల్స్ ఇలా అన్నింట్లోనూ రాణిస్తోన్న అతడు.. తన ఫాలోయింగ్, మార్కెట్‌ను విశేషంగా పెంచుకుంటూ వెళ్తున్నాడు.
ఈ ఉత్సాహంతోనే ఇప్పుడు భారీ బడ్జెట్ మూవీలను లైన్‌లో పెట్టుకుంటున్నాడు. ఈ పరిస్థితుల్లోనే తాజాగా అల్లు అర్జున్ ఓ స్పెషల్ ఈవెంట్‌లో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా అతడు తన భార్య స్నేహా రెడ్డిపై షాకింగ్ కామెంట్స్ చేశాడు. అసలేం జరిగిందో మీరే చూసేయండి!

పుష్పతో పాన్ ఇండియా స్టార్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రెండేళ్ల క్రితం సుకుమార్ దర్శకత్వంలో 'పుష్ప ది రైజ్' అనే సినిమాను చేసిన విషయం తెలిసిందే. ఫుల్ లెంగ్త్ మాస్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ మూవీ భారీ స్థాయిలో ప్రేక్షకాదరణను అందుకుంది. ఫలితంగా కలెక్షన్ల సునామీని సృష్టించింది. అదే సమయంలో ఈ చిత్రం అల్లు అర్జున్‌ను పాన్ ఇండియా స్టార్‌గానూ మార్చేసింది.

ఇప్పుడా సినిమాలతో బిజీగా
పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయిన అల్లు అర్జున్.. ఇప్పుడు పుష్పకు సీక్వెల్‌గా రూపొందుతోన్న 'పుష్ప ది రూల్'లో నటిస్తున్నాడు. ఈ సినిమా ఆగస్టు 15వ తేదీన విడుదల కాబోతుంది. అలాగే, త్రివిక్రమ్ శ్రీనివాస్, సందీప్ రెడ్డి వంగాలతో మూవీలను అనౌన్స్ చేశాడు. వీటిని ఒక్కొక్కటిగా పూర్తి చేసుకునేలా ప్లాన్లు చేస్తున్నాడు. అలాగే, మరికొన్ని ప్రాజెక్టులనూ లైన్‌లో పెడుతున్నాడు.

ప్రేమ పెళ్లితో ఫుల్ ఎంజాయ్
టాలీవుడ్ స్టార్‌గా సత్తా చాటుతోన్న అల్లు అర్జున్.. ఆ మధ్యన స్నేహారెడ్డితో ప్రేమాయణం సాగించాడు. ఈ క్రమంలోనే 2011లో ఆమెను వివాహం చేసుకున్నాడు. ఇక, ఈ జంటకు అయాన్, అర్హా అనే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. షూటింగ్ లేని సమయాల్లో బన్నీ ఎక్కువగా కుటుంబంతోనే సమయాన్ని గడుపుతాడు. తద్వారా టాలీవుడ్‌లో బెస్ట్ కపుల్‌గా పేరు తెచ్చుకున్నారు.

ఆర్య ఈవెంట్‌లో ఫుల్ జోష్
'గంగోత్రి'తో అల్లు అర్జున్ హీరోగా పరిచయం అయినా.. సుకుమార్ చేసిన 'ఆర్య'తో మరో సూపర్ హిట్‌ను అందుకున్నాడు. అలాగే స్టైలిష్ స్టార్ అనే బిరుదును అందుకున్నాడు. అలా ఈ చిత్రం అతడి కెరీర్‌లోనే బెస్ట్ మూవీగా నిలిచింది. ఇక, ఈ చిత్రం 20 సంవత్సరాలు పూర్తి చేసుకోవడంతో తాజాగా ఈవెంట్ నిర్వహించారు. ఇందులో అల్లు అర్జున్ ఎంతో జోష్‌తో కనిపించాడు.
వన్ సైడ్ లవ్ స్నేహా అని
'ఆర్య' మూవీ 20 సంవత్సరాలు ఫంక్షన్‌లో అల్లు అర్జున్ చాలా సంతోషంగా కనిపించాడు. ఆ సమయంలో యాంకర్ అతడిని 'స్నేహా గారు బన్నీ గారిని ఈ ప్రశ్న అడుగుతున్నందుకు సారీ. సార్ మీరు చెప్పండి.. మీ ఫస్ట్ వన్ సైడ్ లవ్ గురించి మాకు తెలుసుకోవాలని ఉంది' అని అడిగింది. దీనికి అల్లు అర్జున్ 'నా లైఫ్ టైం వన్ సైడ్ లవ్ స్నేహా గారితోనే' అని చెప్పాడు.

అలా పంచ్ వేస్తూ షాకింగ్‌గా
యాంకర్ అడిగిన ప్రశ్నకు నవ్వుతూనే సమాధానం ఇచ్చిన అల్లు అర్జున్.. ఆ తర్వాత దాన్ని కంటిన్యూ చేస్తూ.. 'లైఫ్ లాంగ్ నేను ప్రేమించడమే తప్ప అక్కడి నుంచి పెద్దగా ఏమీ ఉండదు' అని షాకింగ్ ఆన్సర్ ఇచ్చాడు. దీంతో అక్కడున్న వాళ్లంతా అవాక్కైపోయారు. ఇక, ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయిపోతోంది.


Click it and Unblock the Notifications











