మరో బ్రాండ్ కు అంబాసిడర్ గా అల్లు అర్జున్.. క్రిష్ డైరెక్షన్లో యాడ్ షూట్.. ఆ భామతో కలిసి!
సుకుమార్ దర్శకత్వంలో పుష్ప అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు అల్లు అర్జున్. ఇక ఒకపక్క సినిమాలు చేస్తూ మరోపక్క అనేక బ్రాండ్స్ కు అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న ఆయన లిస్టులో మరో బ్రాండ్ వచ్చి చేరింది. ఆ వివరాల్లోకి వెళితే

స్టార్ హోటల్‌లో
మెగా హీరో అల్లు అర్జున్ చేతిలో మరో బ్రాండ్ వచ్చి చేరింది.ఈయన ఇప్పటికే పలు కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న విషయం తెల్సిందే.తాజాగా ఈయన ప్రముఖ ఫుడ్ అగ్రిగేటర్ యాప్, జోమాటో బ్రాండ్ అంబాసిడర్‌గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సంతకం చేసారు. హైదరాబాద్‌లోని ఓ స్టార్ హోటల్‌లో ఈ వాణిజ్య ప్రకటన షూటింగ్ జరుగుతోంది.

జోడీగా నేహాశెట్టి
అల్లు అర్జున్ హీరోగా వేదం చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు క్రిష్ ఈ వాణిజ్య ప్రకటన కోసం మెగాఫోన్ పట్టాడు. ఆయన దర్శకత్వంలోనే ఈ యాడ్ తెరకెక్కుతోంది. ఇక ఈ యాడ్‌లో బన్నీకి జోడీగా నేహాశెట్టి నటిస్తోంది. ఇక ఈ బ్రాండ్ ఎండార్స్ మెంట్ ను అతి త్వరలో ఒక గ్రాండ్ ఈవెంట్‌లో జొమాటో ప్రకటిస్తుందని అంటున్నారు.

భారీ మొత్తంలో
ఈ ఎండార్స్‌మెంట్ కోసం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు భారీ మొత్తంలో చెల్లించినట్లు తెలిసింది. రాబోయే రోజుల్లో స్టైలిష్ స్టార్‌ని తన బ్రాండ్ అంబాసిడర్ గా పెట్టుకుని భారీ ప్రచారాన్ని ప్లాన్ చేస్తోంది జొమాటో సంస్థ. ఇప్పటికే అల్లు అర్జున్ చేతులో చాలా బ్రాండ్స్ ఉన్నాయి. అందులో అభి బస్ యాడ్ లో కూడా నటించి వివాదంలో చిక్కుకున్నారు.

జనవరి 7 నుంచి
అల్లు అర్జున్ ఇటీవల పుష్ప సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. క్రిస్మస్ కానుకగా గత ఏడాది డిసెంబర్ 17న దేశవ్యాప్తంగా రిలీజైన 'పుష్ప' సినిమా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఇప్పటికే మంచి వసూళ్లను రాబట్టిన ఈ సినిమా ఓటీటీలోకి కూడా వచ్చేస్తోంది. అమెజాన్ ప్రైమ్ లో రేపటి నుంచి అంటే జనవరి 7 నుంచి ఈ సినిమా స్ట్రీమ్ కానుంది. ఈ విషయాన్ని అమెజాన్ అధికారికంగా ప్రకటించింది కూడా.

భారీ ధరకు
మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ సినిమా హక్కులను అమెజాన్ ప్రైమ్ సంస్థ భారీ ధరకు కొనుగోలు చేసిందని తెలుస్తోంది. ఈ సినిమా కోసం ఏకంగా అన్ని భాషలకు కలిపి 27 కోట్ల నుంచి రూ.30 కోట్లకు డీల్ కుదుర్చుకుందని ప్రచారం జరుగుతొంది. ఇక ఈ సినిమాను నాలుగు భాషల్లో అభిమానుల కోసం స్ట్రీమింగ్ చేయనుంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడలో సినిమా అందుబాటులోకి రానుంది. హిందీ వర్షన్ ను మాత్రం ఇంకా విడుదల చేస్తున్నట్టు అధికారికంగా వెల్లడించ లేదు. ఇక ఇదిలా ఉండగా పుష్ప రెండో భాగం ఫిబ్రవరి లేదా మార్చిలో సెట్స్ పైకి వెళ్లనుంది. త్వరలో మిగిలిన స్క్రిప్ట్ వర్క్‌ను సుకుమార్ ప్రారంభించనున్నారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ డాన్ గా మారిన తరువాత ఎలా ఉండబోతున్నారు అనేది చూపించే అవకాశం ఉందని అంటున్నారు. చూడాలి ఆ సినిమా ఎలా ఉండనుంది అనేది.


Click it and Unblock the Notifications











