ఆ క్షణాలను తలుచుకుని అల్లు అర్జున్ భావోద్వేగం, నేటికి 8 ఏళ్లు..

Recommended Video

Allu Arjun Shares A Throwback Photo On Their Wedding Anniversary | Filmibeat Telugu

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ జీవితంలో ఈ రోజు ప్రత్యేకమైన రోజు. బన్నీ వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టి నేటితో సరిగ్గా 8 సంవత్సరాలు పూర్తయింది. తమ పెళ్లి జరిగిన క్షణాలను గుర్తు చేసుకుంటూ ఆయన భావోద్వేగానికి గురయ్యారు. పెళ్లి ముహూర్తపు ఫోటోను అభిమానులతో పంచుకున్నారు.

స్నేహారెడ్డి, అల్లు అర్జున్ వివాహం మార్చి 6, 2011లో జరిగింది. వీరిది ప్రేమ వివాహం అనే సంగతి తెలిసిందే. ఇద్దరి కమ్యూనిటీలు వేరైనా పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. వీరి అన్యోన్య దాంపత్యానికి గుర్తుగా అయన్, అర్హ జన్మించారు.

పెళ్లి ఫోటో షేర్ చేసిన అల్లు అర్జున్

తమ పెళ్లి విషయం ఇంట్లో ఒప్పించడానికి అల్లు అర్జున్ అప్పట్లో చాలా కష్టాలు పడ్డట్లు వార్తలు వినిపించాయి. ఇద్దరూ వేర్వేరు కమ్యూనిటీలకు చెందిన వారు కావడం, పైగా ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలకు చెందిన వారు కావడమే ఇందుకు కారణం. మొత్తానికి తాను ప్రేమించిన స్నేహారెడ్డిని తన జీవిత భాగస్వామిని చేసుకోవడంలో బన్నీ సక్సెస్ అయ్యాడు.

ఫ్యామిలీ మ్యాన్

ఫ్యామిలీ మ్యాన్

అల్లు అర్జున్-స్నేహారెడ్డి అనోన్య దాంపత్యానికి ప్రతిరూపంగా 2014లో అయాన్ జన్మించాడు. 2016లో అర్హ జన్మించింది. బన్నీ షూటింగులు లేని సమయంలో ఎక్కువగా ఫ్యామిలీతో గడపటానికే ఇష్టపడతాడు. ‘నా పేరు సూర్య' తర్వాత సరైన కథ దొరక్క ఖాళీగా ఉంటున్న స్టైలిష్ స్టార్ తన సమయం మొత్తం పిల్లలతోనే గడిపారు.

త్రివిక్రమ్ మూవీతో త్వరలో...

త్రివిక్రమ్ మూవీతో త్వరలో...

‘నా పేరు సూర్య' ఫెయిల్యూర్ తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్న బన్నీ త్వరలోనే త్రివిక్రమ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రం మార్చి చివరి వారంలో లేదా ఏప్రిల్‌లో సెట్స్ మీదకు వెళ్లబోతోంది.

వరుస కమిట్మెంట్స్

వరుస కమిట్మెంట్స్

దాదాపు 10 నెలలు ఖాళీగా ఉన్న బన్నీ వరుస కమిట్మెంట్స్ ఇచ్చారు. త్రివిక్రమ్ మూవీ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నారు. దీని తర్వాత ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో మరో చిత్రం ఉంటుందట.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X