Allu Arjun: గొప్ప మనసు చాటుకున్న ఐకాన్ స్టార్.. ఏ హీరో చేయని విధంగా వాళ్లందరికీ బంగారు ఉంగరాలు
బడా నిర్మాత కుమారుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్, స్టైల్స్ ఇలా అన్నింట్లోనూ తన సత్తాను నిరూపించుకుని తెలుగు సినీ ఇండస్ట్రీలో బడా హీరోగా దూసుకెళ్తున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. కెరీర్ ఆరంభంలోనే పలు విజయాలను సొంతం చేసుకున్న అతడు.. స్టార్‌డమ్‌ను సైతం త్వరగానే అందుకున్నాడు. ఈ క్రమంలోనే గత ఏడాది 'అల.. వైకుంఠపురములో' చిత్రంతో ఇండస్ట్రీ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.
ఈ ఉత్సాహంతోనే ప్రస్తుతం 'పుష్ప' అనే పాన్ ఇండియా సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా బన్నీ గొప్ప మనసును చాటుకున్నాడు. ఆ వివరాలు మీకోసం!

‘పుష్ప'గా మారిపోయిన ఐకాన్ స్టార్
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కిస్తోన్న చిత్రమే 'పుష్ప'. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. కన్నడ పిల్ల రష్మిక మందన్నా ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది. మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ విలన్‌గా చేస్తున్నాడు. టాప్ మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ దీనికి సంగీతం అందిస్తున్నాడు. సునీల్, అనసూయ ఇందులో కీలక పాత్రలు చేస్తున్న విషయం తెలిసిందే.

రెండు భాగాలు... మొదటిది రెడీగానే
తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో రాబోతున్న 'పుష్ప' మూవీని రెండు భాగాలుగా విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. అందులో మొదటి దాన్ని 'పుష్ప ద రైజ్' పేరిట ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు. ఈ చిత్రాన్ని డిసెంబర్ 17న విడుదల చేస్తున్నారు. దీనికి టైం దగ్గర పడడంతో ఇందుకోసం త్వరితగతిన ఏర్పాట్లను కూడా పూర్తి చేస్తున్నారు.

రిలీజ్‌కు ముందే రికార్డులను కొట్టేసి
'పుష్ఫ' నుంచి కొద్ది రోజుల క్రితమే టీజర్‌ను విడుదల చేశారు. పూర్తి మాస్ ఎలిమెంట్స్‌తో రూపొందిన ఈ వీడియోకు భారీ స్పందన వచ్చింది. ఫలితంగా ఇది ఎన్నో రికార్డులను బద్దలు కొట్టేసింది. అలాగే, ఈ సినిమా నుంచి కొన్ని పాటలను వదలగా వీటికి దేశ వ్యాప్తంగా అదిరిపోయే స్పందన వచ్చింది. ఇక, తాజాగా వచ్చిన ట్రైలర్ అయితే యూట్యూబ్‌ను ఊపి పడేసింది.

రికార్డు స్థాయిలో బిజినెస్.. భారీ ప్లాన్
క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'పుష్ప' మూవీ మొదటి భాగంపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. అందుకు అనుగుణంగానే దీని నుంచి ఏది విడుదలైనా మంచి రెస్పాన్స్ దక్కుతోంది. దీంతో ఈ సినిమా హక్కులు భారీ ధరకు అమ్ముడుపోయాయి. ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా 'పుష్ప ద రైజ్'కు వంద కోట్ల రూపాయలకు పైగానే ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

గొప్ప మనసు చాటుకున్న మెగా హీరో
తెలుగు సినీ ఇండస్ట్రీలోని బడా హీరోల్లో ఒకడిగా వెలుగొందుతోన్న అల్లు అర్జున్.. డౌన్ టూ ఎర్త్ అన్న విషయం తెలిసిందే. అందరితోనూ చక్కగా ఉండడం.. మంచిగా మాట్లాడడం వల్లే అతడికి మంచి పేరు వచ్చింది. అదే సమయంలో సహాయాలు చేయడంలోనూ బన్నీ ఎప్పుడూ ముందుంటాడు. ఈ నేపథ్యంలో తాజాగా కొందరికి అతడు కొన్ని స్పెషల్ గిఫ్టులు ఇచ్చాడని తెలిసింది.
Recommended Video

లక్షలు ఖర్చు పెట్టి మరీ తీసుకొచ్చి
'పుష్ప' సినిమాను అనుకున్న దాని కంటే ముందే కంప్లీట్ చేయడానికి సహాయ పడ్డ యూనిట్ సభ్యులకు అల్లు అర్జున్ గిఫ్ట్‌లు ఇచ్చాడట. కొందరికి పది గ్రాముల బరువున్న బంగారు ఉంగరాలను అందించగా.. మిగిలిన వాళ్లకు పది లక్షల రూపాయలు గిఫ్టుగా ఇచ్చినట్లు సమాచారం. సోమవారం వాటిని బన్నీ వాళ్లకు స్వయంగా పంచి పెట్టాడని ఓ న్యూస్ వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











