ఇది కదా క్రేజ్ అంటే.. నార్త్ లో అల్లు అర్జున్ విగ్రహం ఏర్పాటు.. ఎక్కడా తగ్గని బన్నీ ఫాన్స్!
అల్లు అర్జున్ 'పుష్ప' ఫీవర్ మాములుగా లేదు. తెలుగులోనే కాక ఈ సినిమా తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఏక కాలంలో విడుదల కావడంతో దేశవ్యాప్తంగా పుష్ప రాజ్ హవా నడుస్తోంది. ఇప్పటికే పలువురు క్రికెటర్లు, బాలీవుడ్ ప్రముఖులు సినిమా నుంచి అల్లు అర్జున్ మేనరిజమ్ అనుకరిస్తూ వీడియోలు చేస్తూ ఉండగా ఉత్తరాదిన ఒక ఫ్యాన్ ఏకంగా అల్లు అర్జున్ విగ్రహం కట్టేశాడు. ఆ వివరాల్లోకి వెళితే

రికార్డు స్థాయి వసూళ్లు
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన చిత్రం పుష్ప ది రైజ్. సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమాలో బన్నీ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది. గత ఏడాది డిసెంబర్ 17న విడుదలైన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. తెలుగుతో పాటు ఐదు భాషల్లో విడుదలైన ఈ మూవీ ఊహించని విధంగా వసూళ్ల వర్షం కురిపిస్తూ సరికొత్త రికార్డులు సృష్టించింది. ఎవరూ ఊహించని విధంగా ఉత్తరాదిలో రికార్డు స్థాయి వసూళ్లు రాబట్టి ట్రేడ్ వర్గాలతో పాటు మేకర్స్ ను కూడా విస్మయానికి గురి చేసింది.

నటనకు ప్రశంసలు
అయితే సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా తగ్గేదేలే అనే డైలాగ్, భుజం వచ్చి బన్నీ నడిచే మ్యానరిజం వైరల్ అవుతూనే ఉంది. ఈ సినిమా రిలీజ్ అయ్యాక చాలా సినిమాలు రిలీజ్ అయినా నేటికీ పుష్ప మ్యాజిక్ జనాల్లో హల్ చల్ చేస్తోంది. సామాన్యుల మాట పక్కన పెడితే, పెద్ద పెద్ద స్టార్స్ కూడా సినిమా పాటలపై డ్యాన్స్ చేస్తున్నారు. సౌత్‌తో పాటు, హిందీ బెల్ట్‌లో కూడా ఈ సినిమా సహా అల్లు అర్జున్ నటనకు ప్రశంసలు లభిస్తున్నాయి.

పుష్ప రాజ్ పాత్రకు సరిపోతుందని
ఇదిలా ఉంటే, ఔరంగాబాద్‌లో నివసించే అల్లు అర్జున్ అభిమాని, ఈ సినిమా చూసి ఇంప్రెస్ అయ్యాడు. దీంతో ఆయన ఏకంగా అల్లు అర్జున్ 'పుష్ప' విగ్రహాన్ని తయారు చేశారు . ఔరంగాబాద్‌కు చెందిన సోహన్ కుమార్ ఈ విగ్రహాన్ని తయారు చేశారు. ఈ విగ్రహం అల్లు అర్జున్ యొక్క పుష్ప పాత్ర నుండి ప్రేరణ పొంది తయారు చేశారు. ఈ విగ్రహం పుష్ప రాజ్ పాత్రకు సరిగ్గా సరిపోతుందని సినిమా చూసిన వారికి ఇట్టే అర్ధం అయిపోతుంది.

బహుమతిగా
అల్లు అర్జున్ విగ్రహం చేతిలో తుపాకీ పట్టుకుని ఉన్నట్టు కనిపిస్తోంది. అంతే కాక ఆ విగ్రహం జుట్టు, మీసాలు పుష్ప చిత్రంలో చూపించిన విధంగా తీర్చిదిద్దారు. ఈ విగ్రహం అల్లు అర్జున్‌కి కానుకగా ఇవ్వాలనుకుంటున్నాను అని సోహన్ కుమార్ పేర్కొన్నారు. తాను అల్లు అర్జున్‌కి వీరాభిమానిని అని, ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ విగ్రహాన్ని ఆయనకు బహుమతిగా ఇవ్వాలనుకుంటున్నట్లు చెప్పారు.

భారీ అంచనాలు
ఇప్పుడు సోషల్ మీడియాలో అందరూ సోహన్ కుమార్ యొక్క ఈ కళాకృతిని ప్రశంసిస్తున్నారు. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధించింది. సినిమా రెండో భాగం కూడా త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది. మొదటి భాగం సూపర్ హిట్ కావడంతో రెండో భాగం మీద భారీ అంచనాలు నెలకొన్నాయి.


Click it and Unblock the Notifications











