ఏసియన్ సంస్థతో అల్లు అర్జున్ చర్చలు... అమీర్‌పేటలో మెగా మల్టీప్లెక్స్?
మహేష్ బాబు, ఏసియన్ సినిమాస్ కొలాబరేషన్లో ఇటీవల హైదరాబాద్‌లో నిర్మాణమైన 'ఎఎంబి సినిమాస్' (ఏసియస్ మహేష్ బాబు సినిమాస్) దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. ఇండియాలోని టాప్ మల్టీప్లెక్స్ థియేటర్లలో ఇదీ ఒకటిగా చెప్పుకుంటున్నారు.
అత్యాధునిక టెక్నీలజీ, వరల్డ్ క్లాస్ ఇంటీరియర్ డిజైన్స్, విలాసవంతమైన సౌకర్యాలతో ఈ మెగా మల్టీప్లెక్స్ సినీ ప్రేమికులను ఊరిస్తోంది. మహేష్ బాబు మల్టీప్లెక్స్ వ్యాపారంలోకి దిగిన తర్వాత ఇతర స్టార్స్ కూడా ఈ బిజినెస్‌వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.

అల్లు అర్జున్ మెగా ప్లానింగ్
ఫిల్మ్ నగర్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా మల్టీప్లెక్స్ బిజినెస్‌లోకి దిగేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. అంతా అనుకున్నట్లు జరిగితే త్వరలోనే హైదరాబాద్‌లో మరో మెగా మల్టీప్లెక్స్ ఏర్పడటం ఖాయం అని తెలుస్తోంది.

ఏసియన్ సినిమాస్‌తో చర్చలు
ఏసియన్ సినిమాస్‌కు చెందిన సునీల్ నారంగ్‌తో అల్లు అర్జున్ చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అయితే డీల్ ఇంకా ఫైనలైజ్ కాలేదని అంటున్నారు. డీల్ ఒకే అయితే త్వరలో హైదరాబాద్ నడిఒడ్డున గల అమీర్ పేటలో ఈ మెగా మల్టీప్లెక్స్ ఏర్పడే అవకాశం ఉందని అంటున్నారు.

సత్యం థియేటర్ స్థానంలో?
అమీర్‌పేటలో ఒకప్పుడు ఫేమస్ థియేటర్‌గా పేరు గాంచిన సత్యం థియేటర్‌ను పడగొట్టి కొత్తగా మల్టీప్లెక్స్ కడుతున్నారు. అల్లు అర్జున్, ఏసియన్ సినిమాస్ మధ్య డీల్ ఓకే అయితే ఈ స్థానంలోనే వీరి మల్టీప్లెక్స్ ప్రారంభం అయ్యే అవకాశం ఉందని అంటున్నారు

ఇప్పటికే పలు వ్యాపారాల్లో అల్లు అర్జున్
అల్లు అర్జున్ ఇప్పటికే పలు వ్యాపారాల్లో భాగస్వామిగా ఉన్నారు. హైలైఫ్ బ్రేవింగ్ కంపెనీ పబ్, కన్నోలి కేఫ్ బేకరీ, బి-డబ్స్ స్పోర్ట్స్ బార్ లాంటి వాటిలో ఆయనకు వాటాలు ఉన్నట్లు మీడియా వర్గాల సమాచారం. ఇపుడు మల్టీప్లెక్స్ బిజినెస్‌లోకి కూడా దిగితే బన్నీ వ్యాపార సామ్రాజ్యం మరింత విస్తరించనుంది.

అల్లు అర్జున్ మూవీస్
‘నా పేరు సూర్య' తరువాత అల్లు అర్జున్ ఇంకా ఏ సినిమాకు కమిట్ కాలేదు. వస్తే మంచి బ్లాక్ బస్టర్ మూవీతో రావాలని ప్లాన్ చేసుకుంటున్న స్టైలిష్ స్టార్ వివిధ కథలు వింటున్నారు. ఆ మధ్య విక్రమ్ కుమార్ దర్శకత్వంలో చేయబోతున్నారనే వార్తలు వచ్చాయి. అయితే విక్రమ్ కుమార్.. నాని హీరోగా సినిమా ప్రకటించడంతో ఆ వార్తల్లో నిజం లేదని తేలిపోయింది. మరి బన్నీ నెక్ట్స్ మూవీ ఏమిటో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications











