twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వైరల్ అవుతున్న బన్నీ పిక్.. మెగా ఫాన్స్ ఫిదా.. అక్కడిదే అంటూ టాక్

    |

    అల్లు అర్జున్ స్టైలిష్ లుక్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫొటోలో అల్లు అర్జున్ యమ స్టైలిష్‌గా కనిపిస్తున్నాడు. అంతేకాదు ఈయనను చూస్తుంటే ఫుల్ జోష్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ పిక్ త్రివిక్రమ్ సెట్ లోనిదేనా? లేక మరెక్కడైనా తీసిందా? అనే దానిపై చర్చలు నడుస్తున్నాయి.

    అల్లు అర్జున్- త్రివిక్రమ్ కాంబోలో రాబోతున్న సినిమా కోసం బన్నీ ఎప్పటి నుంచో కసరత్తులు ప్రారంభించాడు. మునుపెన్నడూ కనిపించని ఆల్ట్రా స్టైలిష్ లుక్‌లో కనిపించాలని ఆరాట పడుతున్నాడు. మరోవైపు బన్నీ లుక్‌తో మెగా అభిమానులను సర్‌ప్రైజ్ చేయాలని భావిస్తున్నారు త్రివిక్రమ్. ఈ నేపథ్యంలోనే ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి ఎలాంటి లుక్స్ బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు. కానీ ఊహించని రీతిలో తాజాగా అల్లు అర్జున్ లుక్ ఒకటి కెమెరాకు చిక్కింది. ఈ పిక్‌లో అల్లు అర్జున్ మునుపటి కంటే సన్నగా కనిపిస్తున్నాడు. నార్మల్ హెయిర్ స్టైల్‌తో ఫార్మల్ డ్రెస్‌లో సింపుల్‌గా నడిచి వస్తున్నట్లుగా కనిపిస్తున్నాడు బన్నీ. ముఖంలో పర్ఫెక్ట్ జోష్ కనిపిస్తోంది.

    Allu Arjun Stylish look leaked from Trivikram Srinivas sets

    కాగా త్రివిక్రమ్ సెట్స్ నుంచి అలా అల్లు అర్జున్ బయటకు వస్తుండగా తీసిన పిక్ ఇది అని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అల్లు అర్జున్ గత సినిమా 'నా పేరు సూర్య' ఆశించిన ఫలితం రాబట్టకపోవడంతో ప్రత్యేక శ్రద్ద తీసుకొని త్రివిక్రమ్ సెట్స్‌పై వాలాడు అల్లు అర్జున్. గీతా ఆర్ట్స్‌, హారిక హాసిని క్రియేషన్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. చిత్రంలో బన్నీ సరసన అందాల భామ పూజా హెగ్డే చిందులేస్తోంది. సీనియర్ హీరోయిన్ టబు ముఖ్యపాత్ర పోషిస్తోంది. ఇంకా ఈ చిత్రంలో యంగ్ హీరో సుశాంత్, మరో హీరోయిన్ నివేద పేతురేజ్ కూడా భాగమవుతున్నారని ఇటీవలే ప్రకటించారు యూనిట్ సభ్యులు. అల్లు అర్జున్ కెరీర్‌లో 19 వ సినిమాగా రానున్న ఈ సినిమాపై భారీగా అంచనాలు పెట్టుకుంది ప్రేక్షకలోకం.

    English summary
    Allu Arjun and Trivikram Srinivas are doing a new project with huze expectations. This movie shooting is going on successfully. Now Allu Arjun stylish look leaked from the sets.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X