Allu Arjun: నేషనల్ మీడియాలో బన్నీ హవా.. ఈ బ్రాండ్ స్వాగ్ అదిరింది!

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టార్ ఇమేజ్ ని సంపాదించుకున్న అల్లు అర్జున్ పుష్ప సినిమా నుంచి మాత్రం ఐకాన్ స్టార్ గా మరొక కొత్త ట్రెండ్ సెట్ చేసిన విషయం తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమాతో అల్లు అర్జున్ ఒక్కసారిగా ఫ్యాన్ ఇండియా ప్రపంచంలో అగ్ర హీరోల్లో ఒకరిగా మారిపోయారు. ఇక రీసెంట్ గా బన్నీ స్టైలిష్ లుక్ తో ఒక నేషనల్ మీడియా మ్యాగజైన్ లో కూడా కవర్ పేజీపై దర్శనం ఇవ్వడం మరింత హాట్ టాపిక్ గా మారింది. ఆ వివరాల్లోకి వెళ్తే..

టాలెంట్ తోనే

టాలెంట్ తోనే

గంగోత్రి సినిమా తీసినప్పుడు అతను ఎందుకు పనికిరాడు అని హీరో మెటీరియల్ కాదు అని ఎన్నో విమర్శలు వచ్చాయి. అయితే అలాంటి కామెంట్స్ ఎన్ని వచ్చినా కూడా బన్నీ వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా తన సొంత టాలెంట్ తోనే ఇండస్ట్రీలో ఎదిగాడు అని చెప్పవచ్చు. బన్నీకి మెగా సపోర్ట్ అల్లు అరవింద్ బ్యాక్ గ్రౌండ్ లో ఉన్నప్పటికీ కూడా బన్నీ తో సినిమా చేయాలని అతన్ని వెతుక్కుంటూనే చాలామంది దర్శకులు వచ్చారు.

నెంబర్ వన్ డ్యాన్సర్

నెంబర్ వన్ డ్యాన్సర్

ఆర్య సినిమా నుంచి బన్నీ పుష్ప సినిమా వరకు ప్రతి సినిమాలో ఏదో ఒక డిఫరెంట్ యాంగిల్ ని చూపిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు. డ్యాన్స్ లతో ఏ స్థాయిలో క్రేజ్ అందుకున్నాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇండియాలో ప్రస్తుతం డ్యాన్స్ తో మెప్పించే నెంబర్ వన్ హీరోల్లో బన్నీ కూడా ఉన్నాడు. ఎలాంటి సినిమా చేసిన కూడా బన్నీ స్పెషల్ స్టెప్పులతో అభిమానులకు ఎంతగానో కిక్ ఇస్తున్నాడు.

పుష్ప రాజ్..

పుష్ప రాజ్..

ఇక పుష్ప సినిమాతో అతని స్టార్ ఇమేజ్ ఒక్కసారిగా నేషనల్ వైడ్ గా వైరల్ అయిపోయింది. పుష్ప రాజ్ గా బన్నీ నటించిన విధానం అన్ని వర్గాల ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అంతేకాకుండా అందులో మేనరిజం తగ్గేదే లే డైలాగ్స్ కూడా దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా వైరల్ అయిపోయాయి. ఇంటర్నేషనల్ క్రికెటర్స్ కూడా పుష్ప డైలాగ్స్ తో స్టేడియంలో ఎంతో మందిని ఆకట్టుకున్నారు.

 సౌత్ స్వాగ్

సౌత్ స్వాగ్

ఇండియా టుడే మ్యాగజైన్ కవర్ పేజ్ పై బన్నీకి సంబంధించిన లుక్ ప్రచురించడం సోషల్ మీడియాలో మరింత వైరల్ గా మారిపోయింది. ది సౌత్ స్వాగ్ అని అల్లు అర్జున్ ఫోటోను కవర్ పేజీపై ప్రచురించడం సౌత్ ఇండస్ట్రీకి గొప్ప గర్వకారణం అని అభిమానులు హ్యాపీ అవుతున్నారు. అలాగే మరి కొంతమంది గురించి కూడా ఆ ఆర్టికల్ లో వివరణ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

సోషల్ మీడియాలో ట్రెండ్

సోషల్ మీడియాలో ట్రెండ్

ఇక ఈ మ్యాగజైన్ ఫోటోను ప్రస్తుతం బన్నీ అభిమానులు సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యేలా చేస్తున్నారు. పుష్ప ఫస్ట్ పార్ట్ తోనే ఈ స్థాయిలో క్రేజీ అందుకున్నాడు అంటే ఇక సెకండ్ పార్ట్ వస్తే మాత్రం అంతకుమించి అనేలా క్రేజ్ అందుకుంటాడు అని అభిమానులు మాట్లాడుకుంటున్నారు. ఇక సెకండ్ పార్ట్ రెగ్యులర్ షూటింగ్ అయితే ఆగస్టు నెలలో మొదలయ్యే అవకాశం ఉంది ఇక ఆ సినిమాను వచ్చే ఏడాది విడుదల చేయాలని ప్లాన్ చేసుకుంటున్నారు. మరి పుష్ప 2 ఏ స్థాయిలో సక్సెస్ అవుతుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X