For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  RRR: జూనియర్ ఎన్టీఆర్ ను బన్నీ ఏమని పిలుస్తాడో తెలుసా.. వ్వాటే ఫ్రెండ్షిప్!

  |

  టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న చాలా మంది హీరోలు కూడా బయటి ప్రపంచానికి కలిసికట్టుగా కనిపించక పోయినప్పటికీ వారి పర్సనల్ లైఫ్ లో మాత్రం చాలా సన్నిహితంగా ఉంటారు. బయట స్నేహితులు ఎలా ఉంటారో వారు కూడా అదే తరహాలో ఉండడానికి ప్రయత్నం చేస్తారు. అయితే బంధాలతో కలుపుకుంటు పోయే వారి సంఖ్య మాత్రం చాలా తక్కువ అని చెప్పవచ్చు. అల్లు అర్జున్ కూడా చాలా మంది హీరోలతో క్లోజ్ గానే ఉంటాడు. బయట పార్టీలో ఎవరూ కనిపించినా కూడా వారితో ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తూ ఉంటాడు. బన్నీకి అత్యంత సన్నిహితుల్లో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఉన్నాడు. ఇక ఎన్టీఆర్ ను బన్నీ ఏమని పిలుస్తాడు అనేది చాలామందికి తెలియదు. ఇక ఇటీవల విడుదలైన RRR టీజర్ సందర్భంగా బన్నీ సోషల్ మీడియాలో ఒక ప్రత్యేకమైన పోస్ట్ చేస్తూ తన స్నేహాన్ని చాటుకున్నాడు.

  ఫస్ట్ గ్లింప్స్‌ అంతకుమించి అనేలా..

  ఫస్ట్ గ్లింప్స్‌ అంతకుమించి అనేలా..

  టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా ఇండియన్ సినిమా హిస్టరీ లోనే గతంలో ఎప్పుడూ లేని విధంగా RRR అనే బిగ్ బడ్జెట్ సినిమా రూపొందుతోంది. బిగ్గెస్ట్ మల్టీస్టారర్ సినిమాగా దర్శకుడు రాజమౌళి ఈ మూవీని ఆవిష్కరించాడు. ఈ సినిమాపై ప్రస్తుతం అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ప్రమోషన్ తో జక్కన్న ఆ అంచనాలు మరింత పెంచుతున్నాడు. ఇప్పటికే హీరోలకు సంబంధించిన ఫస్ట్ లుక్ టీజర్స్ భారీస్థాయిలో హైప్ క్రియేట్ చేశాయి. ఇక ఇప్పుడు సినిమాకు సంబంధించిన మొదటి గ్లింప్స్‌ అంతకు మించి అనేలా ఆసక్తిని కలిగిస్తోంది.

  భారీ బడ్జెట్ తో..

  భారీ బడ్జెట్ తో..

  జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో నటించగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ అల్లూరి సీతారామరాజుగా కనిపించబోతున్నాడు వీరి కలయికలో తెరకెక్కిన మొదటి సినిమా కోసం నిర్మాత డి.వి.వి.దానయ్య దాదాపు 450 కోట్ల బడ్జెట్ తో రూపొందించారు. ఈ సినిమాకు రాజమౌళి రెమ్యునరేషన్ పరంగా లాభాల్లో వాటా తీసుకునే విధంగా ఒక డీల్ అయితే సెట్ చేసుకున్నాడు. తప్పకుండా సినిమా ఇండియన్ సినిమా హిస్టరీలోనే సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తుందని అర్థమవుతుంది.

  అల్లు అర్జున్ రియాక్షన్

  అల్లు అర్జున్ రియాక్షన్

  ఈ సినిమా కోసం సాధారణ ప్రేక్షకులు మాత్రమే కాకుండా ప్రముఖ సెలబ్రిటీలు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు సోషల్ మీడియాలో కామెంట్స్ చూస్తేనే అర్థమవుతోంది. ఇప్పటికే చాలా మంది ప్రముఖులు ఈ సినిమా టీజర్ అద్భుతంగా ఉంది అని పాజిటివ్ గా కామెంట్స్ చేస్తున్నారు. ఇక హీరో అల్లు అర్జున్ కూడా తనకు ఎంతో ఇష్టమైన హీరోల పై పాజిటివ్ గా స్పందించడమే కాకుండా తనలోని స్నేహన్ని కూడా బయటపెట్టుకున్నాడు.

  Recommended Video

  Comedian Sudarshan About Manchi Rojulochaie | Santosh Shobhan | Part 03
   బావ అంటూ బన్నీ ట్వీట్

  బావ అంటూ బన్నీ ట్వీట్

  RRR గ్లింప్స్‌ మైండ్ బ్లోయింగ్ అంటూ.. దర్శకుడు ఎస్ఎస్.రాజమౌళి గారూ ఇండియన్ సినిమాకు ఒక గర్వకారణం అని పేర్కొన్నారు. అంతే కాకుండా నా సోదరుడు రామ్ చరణ్ , మా బావ తారక్ పవర్ ప్యాక్ షోతో ఆదరగొట్టారని అన్నాడు. అజయ్ దేవగన్ తో పాటు చిత్ర యూనిట్ సభ్యులందరికి కూడా బన్నీ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే బన్నీ, తారక్ ను బావ అని పిలుస్తాడని ఈ ట్వీట్ తో ఒక క్లారిటీ వచ్చేసింది.

  English summary
  Allu arjun sweet comments on jr ntr RRR first glimpse
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X