twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎవ్వరిని వదలని అల్లు అర్జున్.. కరోనా రాకుండా ముందు జాగ్రత్తగా..

    |

    ఐకాన్ స్టార్ గా ఇటీవల కొత్త ట్యాగ్ అందుకున్న అల్లు అర్జున్ మొన్నటి వరకు పుష్ప సినిమా షూటింగ్ లో బిజీబిజీగా గడిపాడు. ఇక షూటింగ్ అనంతరం కరోనా భారిన పడడంతో 15 రోజుల వరకు హోమ్ క్వారంటైన్ లోనే ఉన్న బన్నీ మొత్తానికి కోలుకున్న విషయం తెలిసిందే. కోవిడ్ నెగిటివ్ రాగానే మొదట సరాసరి పిల్లల దగ్గరకు వెళ్లి వారిని ప్రేమగా దగ్గరకు తీసుకున్నాడు.

    అందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే ఆ బాధను దాటి వచ్చిన బన్నీ తన చుట్టూ ఉన్న ఎవ్వరికి కోవిడ్ రాకూడదని ముందు జాగ్రత్తగా వ్యాక్సిన్ ఇప్పించడానికి రెడీ అయ్యాడు. కుటుంబ సభ్యులందరితో పాటు తన స్టాఫ్ మెంబర్స్ కు అలాగే వారి కుటుంబ సభ్యులందరిలో ఎవరైతే 45ఏళ్లకు పైబడి ఉన్నారో వాళ్ళందరికీ వ్యాక్సిన్ వేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.

    Allu arjun talking vaccine responsibility for his staff

    ప్రస్తుతం సెకండ్ వేవ్ లో 45 ఏళ్ళకు పైబడిన వారిపై కరోనా
    ఎక్కువ ప్రభావం చూపుతోంది. అందుకే వీలైనంత వరకు బన్నీ సొంత ఖర్చులతో స్టాఫ్ కుటుంబ సభ్యులకు కూడా వ్యాక్సిన్ వేయించడానికి సిద్ధమైనట్లు సమాచారం. ఇక బన్నీ నెక్స్ట్ సుకుమార్ పుష్ప సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఆ సినిమా తరువాత సెకండ్ పార్ట్ ను ఫినిష్ చేయనున్నాడు. ఆ వెంటనే లైన్ లో కొరటాల శివ - వేణు శ్రీరామ్ సినిమాలు కూడా రెడీ కానున్నాయి.

    English summary
    Allu Arjun personally overlooked all the arrangements and ensured that his staff members, who are aged above 45 are vaccinated. The actor also gone a step ahead and ensured that the family members of his core team, who are aged above 45, get the vaccine.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X