స్విస్ పర్వతంపై భారతీయ జెండా రెపరెప.. అల్లు అర్జున్ ఎమోషనల్ ట్విట్
కరోనా లాక్‌డౌన్ సమయంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కేవలం ఇంటికే పరిమితం కాకుండా ప్రాణాంతక వ్యాధిపై ప్రజలకు సోషల్ మీడియా ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. సినీ పరిశ్రమ కార్యకలాపాలు స్తంభించడంతో రోజు వారీ వేతన కార్మికులు ఇబ్బందికి గురైతే వారి కోసం ఆర్థిక సహాయాన్ని అందించారు. తాజాగా స్విట్జర్లాండ్‌లోని ఓ పర్వతంపై భారతీయ జెండా రెపరెపలాడటంపై ట్విట్టర్‌లో స్పందిస్తూ..
Recommended Video

స్విట్జర్లాండ్ సంఘీభావం
ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో స్విస్‌కు చెందిన లైట్ ఆర్టిస్టు గెర్రీ హాఫ్‌స్టేట్టర్ ఆ దేశంలోని ఆల్ప్స్ పర్వతాలపై వివిధ దేశాలకు చెందిన జెండాలను ప్రదర్శిస్తూ సంఘీభావం తెలుపుతున్నారు. కొవిడ్19పై యుద్ధానికి మద్దతుగా స్విట్జర్లాండ్ ప్రభుత్వం ఈ కార్యక్రమానికి మద్దతు తెలుపుతున్నది.
ఆల్ప్స్ పర్వతాలపై జెండాల ప్రదర్శన
కరోనావైరస్‌పై పోరాటానికి మద్దతుగా కొద్దిరోజుల క్రితం అమెరికాలో తీవ్ర సంక్షోభంలో ఉండటంతో ఆ దేశపు జెండాను ఆల్ప్స్ పర్వత పంక్తిలోని జెర్మాట్ మ్యాటర్‌లైన్ పర్వతంపై లైటింగ్ ద్వారా ప్రదర్శిస్తూ సంఘీభావం తెలిపారు.ఆ పర్వతంపై అన్ని దేశాల జెండాలను ప్రదర్శించే కార్యక్రమం మార్చి చివరి నుంచి జరుగుతున్నది. తాజాగా భారతీయ జెండాను కూడా ప్రదర్శించారు. త్రివర్ణ పతాకాన్ని ఆల్ప్స్ పర్వతంపై తన లైటింగ్ ద్వారా రెపరెపలాడించారు.
అల్లు అర్జున్ థ్యాంక్స్
ఆల్ప్స్ పర్వత శ్రేణిలోని పర్వతంపై భారతీయ జెండాను రెపరెపలాడించడంపై అల్లు అర్జున్ ట్విట్టర్‌లో స్పందించారు. థ్యాంక్స్ స్విట్జర్లాండ్. జెర్మాట్ పర్వతంపై భారతీయ జెండాను ప్రదర్శించి భారత్‌కు సంఘీభావం ప్రకటించినందుకు ధన్యవాదాలు. ప్రపంచంలోనే పేరు గాంచిన పర్వతంపై మువ్వెన్నెల జెండా ఎగురుతుందని ఎన్నడూ ఊహించలేదు. నా హృదయాన్ని టచ్ చేసింది. ప్రేమకు ధన్యుడను. జై భారత్ అంటూ అల్లు అర్జున్ ట్వీట్ చేశారు.

పుష్ప చిత్రంతో స్టైలిష్ స్టార్
ఇక అల్లు అర్జున్ కెరీర్ విషయానికి వస్తే.. అల వైకుంఠపురంలో చిత్రంతో రికార్డు స్థాయి విజయాన్ని తన ఖాతాలో వేసుకొన్నారు. ప్రస్తుతం దర్శకుడు సుకుమార్‌తో కలిసి పుష్ప అనే చిత్రంలో నటిస్తున్నారు. వాస్తవానికి ఈ చిత్రం ఇప్పటికే సెట్స్‌పైకి వెళ్లాల్సింది. కానీ కరోనావైరస్ కారణంగా వాయిదా పడింది. ఇటీవల అల్లు అర్జున్ జన్మదినోత్సవం రోజున పుష్ప టైటిల్ అనౌన్స్‌మెంట్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది.


Click it and Unblock the Notifications











