మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్: నిహారిక కోసం బన్నీ సరికొత్త ప్లాన్.. ఈ సారి అదిరిపోతుందట.!

By Manoj Kumar P

నిహారిక కొణిదెల.. తెలుగు వారికి ఈ పేరుతో పరిచయం అవసరం లేదు. అంతలా ఈమె ప్రభావం చూపించింది. బుల్లితెరపై యాంకర్‌గా మెప్పించిన ఈ మెగా డాటర్.. ఆ తర్వాత వెండితెరపైనా మెరిసింది. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చినప్పటికీ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకునేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలోనే తన పాత్రకు ప్రాధాన్యం ఉన్న సినిమాల్లో నటించాలని నిర్ణయించుకుంది.

ఇందులో భాగంగానే ఆమె 'ఒక మనసు' అనే సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంటర్ అయింది. అయితే, ఆమె ప్రయాణం అంత సాఫీగా సాగలేదు. దీంతో నిహారిక సినిమాలకు దూరమైపోయింది. ఈ నేపథ్యంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఆమె కోసం ఓ ప్లాన్‌ను సిద్ధం చేశాడని తాజాగా ఓ వార్త బయటకు వచ్చింది. ఇంతకీ బన్నీ ఎం చేయబోతున్నాడు.? వివరాల్లోకి వెళ్తే..

ఒకటి కాదు.. ఏకంగా మూడు సినిమాలు

ఒకటి కాదు.. ఏకంగా మూడు సినిమాలు

యంగ్ హీరో నాగశౌర్యతో కలిసి నిహారిక నటించిన చిత్రం ‘ఒక మనసు'. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ ముందు బోల్తా కొట్టింది. తొలి ప్రయత్నమే విఫలం అయినా.. ఏమాత్రం వెనక్కి తగ్గని మెగా డాటర్.. ‘హ్యాపీ వెడ్డింగ్', ‘సూర్యకాంతం' వంటి సినిమాలు చేసింది. ఈ రెండు కూడా ప్రేక్షకుల మెప్పు పొందలేకపోయాయి.

అప్పుడే డిసైడ్ అయిపోయింది

అప్పుడే డిసైడ్ అయిపోయింది

జయాపజయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసినప్పటికీ ఒక్కటంటే ఒక్క హిట్ కూడా దక్కకపోవడంతో నిహారిక కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై సినిమాల్లో నటించకూడదనే ఆమె నిర్ణయించుకున్నట్లు ఆ మధ్య ప్రచారం జరిగింది. ఇదే విషయాన్ని తండ్రి నాగబాబుతో పాటు పెదనాన్న చిరంజీవితో కూడా చెప్పిందనే టాక్ వినిపించింది.

చిరకాల కోరికను నెరవేర్చుకుంది

చిరకాల కోరికను నెరవేర్చుకుంది

సినిమాల్లో నటించకూడదని నిర్ణయించుకున్నప్పటికీ ఓ ప్రతిష్టాత్మక చిత్రంలో చాన్స్ రావడంతో ఆమె వెనక్కి తగ్గింది. అదే.. మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘సైరా: నరసింహారెడ్డి'. ఈ సినిమాలో నిహారిక ఓ ముఖ్య పాత్రలో కనిపించింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమాలో నటించడం ద్వారా నిహారిక.. తన పెదనాన్న సినిమాలో చేయాలన్న కోరికను నెరవేర్చుకుంది.

సినిమాలకు బ్రేక్.. అక్కడ మాత్రం తగ్గట్లేదు

సినిమాలకు బ్రేక్.. అక్కడ మాత్రం తగ్గట్లేదు

నిహారిక సినిమాలకు మాత్రమే బ్రేక్ ఇచ్చింది. అదే సమయంలో తన సొంత ప్రొడక్షన్‌లో వెబ్ సిరీస్‌లు నిర్మించడం మాత్రం కొనసాగిస్తోంది. ఈ క్రమంలోనే ఆమె ఇటీవల ‘మ్యాడ్ హౌస్' అనే వెబ్ సిరీస్‌ను ప్రారంభించింది. 100 ఎపిసోడ్స్‌తో కూడిన ఈ వెబ్ సిరీస్ ఇటీవలే ప్రారంభమైంది. మహేశ్ ఉప్పాల తెరకెక్కిస్తున్న ఈ వెబ్ సిరీస్‌ను ఇన్వినీటం వారు కో ప్రొడ్యూస్ చేస్తున్నారు.

నిహారిక కోసం బన్నీ సరికొత్త ప్లాన్

నిహారిక కోసం బన్నీ సరికొత్త ప్లాన్

నిహారిక కోసం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సరికొత్త ప్లాన్ సిద్దం చేస్తున్నాడని తాజాగా ఓ వార్త బయటకు వచ్చింది. దాని ప్రకారం.. అతడు త్వరలోనే చేయనున్న సినిమాలో ఆమెను తీసుకోవాలని సుకుమార్‌తో చెప్పాడట బన్నీ. ఈ పాత్ర అదిరిపోయేలా ఉంటుందని అంటున్నారు. ఈ సినిమాతో నిహారికకు మంచి బ్రేక్ రావడం ఖాయం అన్న టాక్ వినిపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X