పవన్‌కు అల్లు అర్జున్ పరామర్శ.. రాజమండ్రిలో స్టైలిష్ స్టార్‌కు ఘన స్వాగతం
ఎన్నికల ప్రచారంలో అనారోగ్యానికి గురైన జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను పరామర్శించేందుకు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మంగళవారం ఉదయమే విమానంలో రాజమండ్రికి చేరుకొన్నారు. రాజమండ్రి విమానంలో అభిమానులు పెద్ద ఎత్తున ఘన స్వాగతం తెలిపారు. రాజమండ్రి నుంచి ఆయన పాలకొల్లుకు వెళ్లి 10 గంటల సమయంలో పవన్ కల్యాణ్‌ను కలుసుకొంటారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొంటారు.
అనంతరం అక్కడి నుంచి బయలుదేరి అభిమానులతో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొంటారు. ఈ సందర్బంగా జనసేనకు అల్లు అర్జున్ సంపూర్ణ మద్దతు తెలియజేస్తారు. అనంతరం మీడియాతో మాట్లాడుతారు అని ఆయన సన్నిహితులు పేర్కొన్నారు.

భీమవరంలో పవన్ కల్యాణ్, నరసాపురం పార్లమెంట్ స్థానంలో నాగబాబు విజయానికి కృషి చేయాలని అల్లు అర్జున్ పిలుపునిస్తారని తెలిసింది. ఏపీ ఎన్నికల ప్రచారానికి ఏప్రిల్ 9 చివరి రోజు కావడంతో అల్లు అర్జున్ ఈ చర్యలు తీసుకొన్నట్టు సమాచారం. పలు సమావేశాల్లో పాల్గొన్న తర్వాత అల్లు అర్జున్ అక్కడే ఉంటారా? లేక సాయంత్రం హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం చేస్తారా అనే విషయంపై క్లారిటీ లేదు.


Click it and Unblock the Notifications











