పొలిటికల్ థ్రిల్లర్ లో అల్లు అర్జున్
సినిమా సినిమాకు వేరియేషన్ చూపించాలని తపన పడే అల్లు వారి అబ్బాయి, అల్లు అర్జున్, ఓ వైపు పుష్పను పట్టాలెక్కించేందుకు సమాయత్తం అవుతూనే, ఇంకోవైపు నెక్స్ట్ మూవీని కూడా లైన్ లో పెట్టేందుకు సిద్ధమవుతున్నాడు. అయితే ఈ సారి వెరైటీగా పొలిటికల్ థ్రిల్లర్ పై గురిపెట్టాడట బన్నీ బాబు.
పుష్ప సినిమాలో గంధం చెక్కల దొంగలా కనిపించనున్న అల్లు అర్జున్, నెక్స్ట్ మూవీ పూర్తి భిన్నంగా ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. లాక్ డౌన్ సమయంలో ఎన్నో కథలు విన్న బన్నీ, చివరకి యాత్రా దర్శకుడు మాహి రాఘవ్ చెప్పిన పొలిటికల్ థ్రిల్లర్ స్టోరీకీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. మహి కథకు ఇంప్రెస్ అయిన అర్జున్, ఈ సినిమాను కూడా త్వరలోనే పట్టాలెక్కించాలని ఉవ్విళ్లూరుతున్నాడట.

వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కబోతోందని వినికిడి. ఇకపోతే నిర్మాత ప్రసాద్ వి. పొట్లూరీ ఈ సినిమా నిర్మాణ బాధ్యతలు భుజానికెత్తుకునేందుకు సిద్ధమయ్యారని తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడనుంది. సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా పట్టాలెక్కగానే ఈ విశేషాన్ని బహిర్గతం చేయాలని బన్నీ ఆలోచిస్తున్నాడట. ఏమైనా, పుష్ప సినిమాతో పాటూ, బన్నీ నెక్స్ట్ సినిమా కూడా జనాలకు ఆసక్తి రేకెత్తిస్తోంది అనడంలో సందేహమే లేదు.


Click it and Unblock the Notifications











