twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బన్నీ, సుకుమార్ చిత్రంపై క్లారిటీ.. ప్రారంభం ఎప్పుడంటే!

    |

    అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీకి కొన్ని రోజుల క్రితం ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. రంగస్థలం తర్వాత సుకుమార్ బన్నీని డైరెక్ట్ చేయబోతున్నాడు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ గురించి ఇప్పటి నుంచే అభిమానుల్లో ఆసక్తి నెలకొని ఉంది. ప్రస్తుతం అల్లు అర్జున్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శత్వంలో నటిస్తున్నాడు. ఇదిలా ఉండగా యువ దర్శకుడు వేణు శ్రీరామ్ కు కూడా బన్నీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

    త్రివిక్రమ్ చిత్రం తర్వాత బన్నీ సుకుమార్ తో సినిమా ప్రారంభిస్తాడా లేక వేణు శ్రీరామ్ దర్శకత్వంలో నటిస్తాడా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఈ విషయంలో తాజాగా కాస్త క్లారిటీ వచ్చింది. అల్లు అర్జున్ ఈ నెలలోనే సుకుమార్ తో సినిమాని ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది. మే 11న సుకుమార్, బన్నీ చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభమవుతుందట. కానీ రెగ్యులర్ షూటింగ్ ని మాత్రం త్రివిక్రమ్ చిత్రం పూర్తయ్యాక మొదలు పెట్టనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

    Allu Arjun To start movie with Sukumar in this month only

    అంటే బన్నీ ఈ ఏడాది రెండు చిత్రాల్లో నటించబోతున్నాడు. వేణుశ్రీరామ్ దర్శకత్వంలోని చిత్రం వచ్చే ఏడాది ప్రారంభం అవుతుంది. త్రివిక్రమ్ చిత్రంలో అల్లు అర్జున్ సరసన క్రేజీ హీరోయిన్ పూజా హెగ్డే నటిస్తోంది. తమన్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు.

    English summary
    Allu Arjun To start movie with Sukumar in this month only
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X