మరో కొత్త బిజినెస్ లోకి బన్నీ.. ఈసారి దేని మీద కన్నేశాడంటే?
సినిమా నటీనటులు, ఇతర టెక్నీషియన్స్ వ్యాపారాలు చేయడం చాలా కామన్. అయితే ఇప్పుడు ఎక్కువగా హీరో హీరోయిన్లు తమ బ్రాండ్ ను ప్రమోట్ చేసుకునే పనిలో పడ్డారు. ఇప్పటికే అల్లు అర్జున్ పలు వ్యాపారాలు చేస్తూ ఉండగా ఆయన కొత్త బిజినెస్ చేసే పనిలో ఉన్నాడని అంటున్నారు. ఆ వివరాల్లోకి వెళితే
Recommended Video

ప్రొడక్షన్ హౌస్ లాంచ్ చేయడానికి
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఒక పక్క సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గడుపుతున్నారు. తనకు సొంతంగా ప్రొడక్షన్ హౌస్ లేదు కానీ తండ్రికి గీతా ఆర్ట్స్, గీతా ఆర్ట్స్ 2 బ్యానర్లు ఉన్నాయి. అలాగే సొంత అన్న బాబీ కొత్త ప్రొడక్షన్ హౌస్ మొదలు పెట్టారు. ఆయన గని సినిమాతో ప్రొడ్యూసర్ గా లాంచ్ అవుతున్నారు. అయినా సరే బన్నీ కొత్త ప్రొడక్షన్ హౌస్ లాంచ్ చేయడానికి చూస్తున్నారు. దాని ద్వారా యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలని చూస్తున్నారు.

ఏషియన్ సినిమాతో కలిసి
ఇక మరో పక్క మహేష్ బాబు, విజయ్ దేవరకొండ బాటలో బన్నీ మల్టిప్లెక్స్ బిజినెస్ స్టార్ చేస్తోన్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ అమీర్ పేటలోని సత్యం థియేటర్ స్థానంలో ఏషియన్ సత్యం సినిమాస్ అనే మల్లీప్లెక్స్‌ను బన్నీ ఏషియన్ సినిమాతో కలిసి నిర్మిస్తున్నాడు. ఇక దీనిక సంబంధించిన వర్క్ కూడా మొదలైంది. త్వరలోనే దీనిని లాంచ్ చేయడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి.

కొత్త బిజినెస్‌ను ప్రారంభించబోతున్నట్లు
ఆ సంగతి అలా ఉంచితే ఆయన మరో కొత్త బిజినెస్‌ను ప్రారంభించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆయన బ్రాండ్ నేమ్ ఏఏ(AA) పేరుతో కొత్త బ్రాండ్‌ను మార్కెట్‌లోకి తెచ్చేందుకు బన్నీ ప్లాన్ చేస్తున్నాడని అంటున్నారు. స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్‌గా ప్రమోషన్ సంపాదించిన బన్నీ వరస చిత్రాల విజయంతో దూసుకుపోతున్నాడు. తాజాగా పుష్పతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన ఆయన అల్లు అర్జున్ కొత్త బ్రాండ్‌ను లాంచ్ చేయనున్నాడనే వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది.

బ్రాండ్‌ను ప్రమోట్ చేస్తూ
ఆయనకు ముందే ఆలోచన ఉందొ లేదో తేలియాడే కానీ ఇప్పటికే బన్నీ AA అనే తన పేరునే బ్రాండ్‌ను ప్రమోట్ చేసిన సంగతి తెలిసిందే. తన సినిమాలకు సంబంధించిన ఏ ఈవెంట్‌లో చూసిన AA బ్రాండ్‌ను ప్రమోట్ చేస్తూ వస్తున్నాడు. ఎక్కువగా ఆయనని గమనిస్తే మనం ఇట్టే గుర్తు పట్టచ్చు. ఇప్పడు దానినే తన బ్రాండ్ నేమ్ గా చేసుకోబోతున్నట్టు చెబుతున్నారు.

AA అనే బ్రాండ్ నేమ్
నిజానికి ముందు నుంచీ అల్లు అర్జున్ ధరించే టీ-షర్ట్స్‌పై కూడా AA అనే బ్రాండ్ నేమ్ కనిపిస్తుంది. ఇప్పడు అదే పేరుతో డ్రెస్ బిజినెస్ ను స్టైలిష్ స్టార్ మొదలు పెట్టబోతున్నాడని అంటున్నారు. అయితే ఈ ప్లాన్ ఇప్పటిది కాదని, ఎప్పటి నుంచి ఆ ఆలోచనలో ఉన్నారని అంటున్నారు. వాస్తవానికి ఈ బ్రాండ్ ఇప్పటికే మార్కెట్లోకి రావాల్సి ఉంది. కానీ కరోనా నేపథ్యంలో ఆలస్యమైనట్లు చెబుతున్నారు. అయితే గత ఏడాది పుష్ప ది రైజ్ సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చి హిట్ కొట్టిన ఆయన ఇప్పుడు ఈ ఏడాది పుష్ప ది రూల్ తో రానున్నాడు.


Click it and Unblock the Notifications











