For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  'Pushpa’ కోసం అల్లు అర్జున్ రికార్డు స్థాయి రెమ్యూనరేషన్: ఫస్ట్ పార్టుకు అంతే.. రెండో దానికి డబుల్

  |

  టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కుమారుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు అల్లు అర్జున్. మొదటి సినిమాతోనే తన యాక్టింగ్ నైపుణ్యాన్ని ప్రదర్శించిన అతడు.. ఆ వెంటనే పలు విజయాలను తన ఖాతాలో వేసుకున్నాడు. అదే సమయంలో యాక్టర్‌గా, డ్యాన్సర్‌గా, ఫైటర్‌గా ఇలా అన్నింట్లోనూ రాణిస్తూ స్టార్ హీరోగా ఎదిగిపోయాడు. గత ఏడాది ఇండస్ట్రీ హిట్‌ను అందుకున్న ఈ స్టైలిష్ హీరో.. ప్రస్తుతం 'పుష్ప' అనే సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతుంది. దీని కోసం బన్నీ తీసుకునే రెమ్యూనరేషన్ వివరాలు లీకయ్యాయి. ఆ సంగతులు మీకోసం!

  పుష్పరాజ్‌గా మారిన అల్లు అర్జున్

  పుష్పరాజ్‌గా మారిన అల్లు అర్జున్

  క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో స్టార్ హీరో అల్లు అర్జున్ నటిస్తోన్న చిత్రం ‘పుష్ప'. పాన్ ఇండియా రేంజ్‌లో రూపొందుతోన్న ఈ సినిమాలో కన్నడ పిల్ల రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. మలయాళ హీరో ఫహద్ ఫాసిల్ విలన్‌గా చేస్తున్నాడు. దేవీ సంగీతం అందిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ దీన్ని నిర్మిస్తోంది. గంథపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంతో వస్తుంది.

   ఈ సినిమాతో ఐకాన్ స్టార్‌గా మారి

  ఈ సినిమాతో ఐకాన్ స్టార్‌గా మారి

  సుకుమార్ తెరకెక్కించిన ‘ఆర్య'తో స్టైలిష్ స్టార్ అనే బిరుదును సొంతం చేసుకున్నాడు అల్లు అర్జున్. ఇప్పుడదే దర్శకుడు తీస్తున్న ‘పుష్ప'తో ఐకాన్ స్టార్‌గా మారాడు. దీనికి కారణం ఈ సినిమా కోసం అతడు ఎన్నో సాహసాలు చేస్తుండడమేనట. ఇప్పటికే లారీ డ్రైవింగ్ నేర్చుకున్న బన్నీ.. చిత్తూరు యాసతో మాట్లాడుతున్నాడు. అన్నింటికీ మించి పాత్ర కోసం డీ గ్లామర్‌గా కనిపిస్తున్నాడు.

  రిలీజ్‌కు ముందే చరిత్ర సృష్టించాడు

  రిలీజ్‌కు ముందే చరిత్ర సృష్టించాడు

  అల్లు అర్జున్ పుట్టిన రోజును పురస్కరించుని ‘Introducing Pushpa Raj' అనే వీడియోను విడుదల చేశారు. పూర్తి మాస్ ఎలిమెంట్స్‌తో రూపొందిన ఈ వీడియోకు ప్రేక్షకుల నుంచి విపరీతమైన స్పందన వచ్చింది. ఫలితంగా ఇది ఎన్నో రికార్డులను బద్దలు కొట్టేసింది. తద్వారా తెలుగులోనే ఎక్కువ వ్యూస్ సాధించిన టీజర్‌గా నిలిచింది. ఇప్పటికి దీనికి 65 మిలియన్ వ్యూస్ వచ్చాయి.

  రెండు భాగాలుగా ‘పుష్ప' విడుదల

  రెండు భాగాలుగా ‘పుష్ప' విడుదల

  పాన్ ఇండియా రేంజ్‌లో రాబోతున్న ‘పుష్ప' మూవీని రెండు భాగాలుగా విడుదల చేయబోతున్నారని ఇటీవలే ఓ న్యూస్ బయటకు వచ్చింది. దీంతో ఇది దేశ వ్యాప్తంగ చర్చనీయాంశం అయింది. ఇలాంటి సమయంలోనే తాజాగా నిర్మాతల్లో ఒకరైన రవి శంకర్ కూడా ఈ వార్తను ధృవీకరించారు. ఇక, ఇందులో మొదటి భాగం ఈ అక్టోబర్‌లో, రెండోది వచ్చే ఏడాది విడుదల కానున్నాయట.

  అల్లు అర్జున్ రికార్డు రెమ్యూనరేషన్

  అల్లు అర్జున్ రికార్డు రెమ్యూనరేషన్

  ప్రస్తుతం తెలుగులో స్టార్ హీరోలుగా ఉన్న వాళ్లంతా భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. అయితే, అల్లు అర్జున్ మాత్రం వాళ్లతో పోలిస్తే చాలా తక్కువ చార్జ్ చేస్తున్నాడని ప్రచారం జరుగుతోంది. కానీ, ‘పుష్ప' సినిమాకు మాత్రం అతడు రికార్డు స్థాయిలో రెమ్యూనరేషన్‌ను అందుకుంటున్నాడని తాజాగా ఓ న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

  ముందు చేసుకున్న డీల్ ఎంతంటే?

  ముందు చేసుకున్న డీల్ ఎంతంటే?

  వాస్తవానికి ‘పుష్ప'ను రెండు భాగాలుగా విడుదల చేయాలని ముందుగా భావించలేదు. కానీ, సినిమాలో చెప్పాల్సిన కంటెంట్ రెండింటికి సరిపోయేంతగా ఉండడంతో ఇటీవలే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక, ఈ మూవీ కోసం బన్నీ కేవలం రూ. 25 కోట్లు మాత్రమే రెమ్యూనరేషన్‌గా డీల్ చేసుకున్నాడట. ఆ తర్వాత సినిమా లాభాల్లో వాటా అడిగాడని ప్రచారం జరుగుతోంది.

  Allu Arjun Family Time, Pushpa రెండు భాగాలు It's Official అంటున్న నిర్మాత || Filmibeat Telugu
  రెండో దానికి డబుల్ రెమ్యూనరేషన్

  రెండో దానికి డబుల్ రెమ్యూనరేషన్

  ఇప్పుడు ‘పుష్ప'ను రెండు భాగాలుగా తీద్దామని అనుకున్న వెంటనే అల్లు అర్జున్ రెమ్యూనరేషన్ డబుల్ అయిందట. రెండో పార్ట్ కోసం అతడు ఏకంగా రూ. 50 కోట్లు చార్జ్ చేస్తున్నాడని ఓ న్యూస్ తాజాగా లీకైంది. పాన్ ఇండియా రిలీజ్ కావడంతో పాటు దీని కోసం బన్నీ ఎన్నో సాహసాలు చేస్తున్నాడు. సో.. అతడి కష్టానికి తగ్గట్లుగానే నిర్మాతలు భారీ మొత్తం చెల్లిస్తున్నారని తెలుస్తోంది.

  English summary
  Allu Arjun Recent Movie Pushpa will be Release in Two Parts. For Second Part Icon Star Took Rs 50 Crore Remuneration.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X