twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అల్లు అర్జున్ డెడికేషన్‌కు ఇదే నిదర్శనం: అతడిని కూడా వెంట తీసుకెళ్తున్నాడట

    |

    బడా ఫ్యామిలీ నుంచి సినిమాల్లోకి ప్రవేశించినా.. యాక్టింగ్, డ్యాన్స్, డైలాగ్స్, ఫైట్స్ ఇలా అన్నింటిలోనూ రాణిస్తూ స్టార్ హీరోగా ఎదిగిపోయాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. అందుకే అతడి ప్రతి సినిమాలోనూ కష్టం స్పష్టంగా కనిపిస్తుంటుంది. ఇక, ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో బన్నీ 'పుష్ప' అనే మూవీ చేస్తున్నాడు. దీని కోసం అతడు మరింతగా శ్రమిస్తున్నాడు. ఇందులో గంథపు చెక్కల స్మగ్లర్‌గా నటించనున్న అతడు.. లారీ డ్రైవింగ్ నేర్చుకున్నాడు. అలాగే, చిత్తూరు స్లాంగ్‌లో మాట్లాడబోతున్నాడు. డీ గ్లామర్‌గా ఉండే ఈ రోల్ కోసం అన్ని భాషల్లో డబ్బింగ్ చెప్పుకోబోతున్నాడు కూడా.

    ఇక, తాజా సమాచారం ప్రకారం.. 'పుష్ప' కోసం జిమ్‌లో చెమటోడ్చుతోన్న అల్లు అర్జున్.. షూటింగ్ స్పాట్‌కు సైతం తన పర్సనల్ ట్రైనర్‌ను తీసుకెళ్తున్నాడట. అక్కడ కూడా ఉదయం, సాయంత్రం తెగ కసరత్తులు చేస్తున్నాడని అంటున్నారు. ఇటీవల తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లిలో జరిగిన భారీ షెడ్యూల్ సమయంలోనూ ఫిట్‌నెస్ ట్రైనర్ బన్నీ వెంటనే ఉన్నాడట. అందుబాటులో ఉన్న వాటితో అక్కడ కూడా వర్కౌట్లు చేయించాడని తెలుస్తోంది. ఈ ఒక్కటే బన్నీకి సినిమాల పట్ల ఉన్న ప్యాషన్‌ను చూపిస్తోంది. అలాగే, అతడి డెడికేషన్‌కు అద్దం పడుతోంది.

     Allu Arjun Travel with personal trainer to Pushpa sets

    మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోన్న 'పుష్ప'లో కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా హీరోయిన్‌గా చేస్తోంది. ఈ సినిమా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో రూపొందనుంది. భారీ బడ్జెట్‌తో పాటు పాన్ ఇండియా లెవెల్‌లో తెరకెక్కుతుండడంతో 'పుష్ప' మూవీ కోసం అల్లు అర్జున్ ఎన్నో సాహసాలు చేస్తున్నాడు. ఆగస్టు 13, 2021న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లు అందులో వెల్లడించారు. ఇక, ఈ సినిమా టీజర్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఏప్రిల్ 8న విడుదల కాబోతుందని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోన్న విషయం తెలిసిందే.

    English summary
    బడా ఫ్యామిలీ నుంచి సినిమాల్లోకి ప్రవేశించినా.. యాక్టింగ్, డ్యాన్స్, డైలాగ్స్, ఫైట్స్ ఇలా అన్నింటిలోనూ రాణిస్తూ స్టార్ హీరోగా ఎదిగిపోయాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. అందుకే అతడి ప్రతి సినిమాలోనూ కష్టం స్పష్టంగా కనిపిస్తుంటుంది. ఇక, ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో బన్నీ ‘పుష్ప’ అనే మూవీ చేస్తున్నాడు. దీని కోసం అతడు మరింతగా శ్రమిస్తున్నాడు. ఇందులో గంథపు చెక్కల స్మగ్లర్‌గా నటించనున్న అతడు.. లారీ డ్రైవింగ్ నేర్చుకున్నాడు. అలాగే, చిత్తూరు స్లాంగ్‌లో మాట్లాడబోతున్నాడు. డీ గ్లామర్‌గా ఉండే ఈ రోల్ కోసం అన్ని భాషల్లో డబ్బింగ్ చెప్పుకోబోతున్నాడు కూడా.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X