అల్లు అర్జున్, త్రివిక్రమ్ సినిమా లాంచ్‌కు ముహూర్తం కుదిరినట్లేనా!
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ చిత్రానికి రంగం సిద్ధం అయింది న్యూ ఇయర్ సందర్భంగా ఈ చిత్రాన్ని అధికారకంగా ప్రకటించారు. ఈ చిత్రం ఎప్పటి నుంచి ప్రారంభం అవుతుందనే చర్చ జరుగుతుండగా ఆసక్తికర వార్తలు వస్తున్నాయి. అల్లు అరవింద్, రాధాకృష సంయుక్తంగా నిర్మించే ఈ చిత్రాన్ని ఫ్రిబ్రవరి ప్రేమికుల దినోత్సవం సందర్భంగా లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది.
ఆ వెంటనే రెగ్యులర్ షూటింగ్ ని కూడా ప్రారంభిస్తారట. ఈ చిత్రాన్ని దసరా కానుకగా విడుదల చేయాలనేది త్రివిక్రమ్ ప్లాన్ గా చెబుతున్నారు. త్రివిక్రమ్ చివరి చిత్రం అరవింద సమేత కూడా దసరాకే విడుదలై మంచి విజయం సాధించింది. ఈ చిత్రంలో అల్లు అర్జున్ కు జోడిగా క్రేజీ హీరోయిన్ కియారా అద్వానీని ఎంపిక చేసుకోనున్నట్లు తెలుస్తోంది.

ఈ వివరాలని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి చిత్రాలు మంచి విజయం సాధించాయి. ఈ రెండు చిత్రాలకు రాధాకృష్ణే నిర్మాత కావడం విశేషం. నా పేరు సూర్య చిత్రం తరువాత బన్నీ చాలా గ్యాప్ తీసుకున్నాడు. నా పేరు సూర్య చిత్రం ఫాన్స్ ని పూర్తిగా నిరాశ పరిచింది. త్రివిక్రమ్ చిత్రంతో అభిమానులని సంతృప్తి పరచాలని అల్లు అర్జున్ భావిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











