త్రివిక్రమ్ సినిమాలో రెండు డిఫరెంట్ లుక్స్‌లో అల్లు అర్జున్
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన తర్వాతి సినిమా త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయబోతున్న సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ తాను రాసుకున్న కథకు తగిన విధంగా హీరో లుక్ ఉండాలనే విషయంలో చాలా కచ్చితంగా ఉంటారు. అందుకే ఈ విషయంలో బన్నీకి కొనని సూచనలు చేశారట.
ఈ చిత్రంలో అల్లు అర్జున్ రెండు డిఫరెంట్ లుక్స్‌లో కనిపించబోతున్నారు. దర్శకుడి చెప్పిన విధంగా మారడం కోసం అల్లు అర్జున్ స్ట్రిక్ట్ డైట్ మెయింటేన్ చేస్తున్నారు. మరి స్టైలిష్ స్టార్ లుక్ ఎలా ఉండబోతోందనే విషయం తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

అల్లు అర్జున్ 'నాపేరు సూర్య' తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నారు. ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద అనుకున్న విధంగా ఫలితం ఇవ్వక పోవడంతో కథల ఎంపిక విషయంలో ఆచితూచి ముందుకు వెళుతున్నారు. చాలా మంది దర్శకులు కథలు విన్న తర్వాత త్రివిక్రమ్ చెప్పిన కథతో బన్నీ సంతృప్తి చెందారు. 2019 న్యూ ఇయర్ సందర్భంగా తమ కాంబినేషన్లో సినిమా రాబోతున్నట్లు ప్రకటించారు. ఏప్రిల్ రెండో వారంలో సినిమా ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టినరోజు కావడంతో ఆ తర్వాతే సినిమా లాంచ్ చేస్తారని టాక్.
ఈ చిత్రాన్ని హారిక హాసిన ప్రొడక్షన్స్, గీతా ఆర్ట్స్ భారీగా నిర్మించబోతున్నారు. ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించబోతున్నారు. త్వరలోనే పూర్తి వివరాలు ప్రకటించనున్నారు.


Click it and Unblock the Notifications











