దుమ్ము దులిపేస్తున్న అల్లు అర్జున్.. టాలీవుడ్‌లో ఎవరికీ దక్కని రికార్డు సొంతం

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - హరీశ్ శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం 'డీజే: దువ్వాడ జగన్నాథమ్'. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాలో బన్నీ సరసన పూజా హెగ్డే నటించింది. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన 'డీజే'.. మొదట మిక్స్‌డ్ టాక్‌ను తెచ్చుకున్నప్పటికీ క్రమంగా హిట్ టాక్ సంపాదించింది. అంతేకాదు, భారీ కలెక్షన్లను సైతం సాధించింది. ఈ సినిమా బన్నీ కెరీర్‌లోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా నిలిచింది.

నాన్ బాహుబలి రికార్డు

నాన్ బాహుబలి రికార్డు

వెండితెరపైనే కాదు.. బుల్లితెరపైనా ఈ సినిమా రికార్డుల మోత మోగించింది. టెలివిజన్ ప్రీమియర్లో ‘దువ్వాడ జగన్నాథమ్‌'కు రికార్డు స్థాయిలో 21.7 టీఆర్పీ వచ్చింది. ‘బాహుబలి' మినహా మరే సినిమా కూడా ఈ స్థాయిలో టీఆర్పీ సాధించలేదు. ‘శ్రీమంతుడు', ‘ఫిదా' సినిమాలకు 21+ టీఆర్పీ రాగా.. వీటిని మించి డీజే రేటింగ్ ఉండటం గమనార్హం. ఎన్టీఆర్ నటించిన జనతాగ్యారేజ్ మూవీకి ‘20.7' టీఆర్పీ వచ్చింది. దీంతో అల్లు అర్జున్ సినిమా నాన్ బాహుబలి రికార్డును సాధించింది.

యూట్యూబ్ సెన్సేషన్

యూట్యూబ్ సెన్సేషన్

ఇక, యూట్యూబ్‌లో సైతం ఈ సినిమా దుమ్ము దులిపేసింది. ‘డీజే' పేరిట హిందీలో డబ్ అయిన ఈ సినిమా అత్యధిక వ్యూస్ సొంతం చేసుకుంది. ఆ మూవీ ఈ మధ్యనే 150 మిలియన్ వ్యూస్‌ను క్రాస్ చేసింది. అంతేకాదు, 4.9 లక్షల లైకులు వచ్చాయి. గతంలో బన్నీ సినిమా ‘సరైనోడు' కూడా యూట్యూబ్‌లో రికార్డుల మీద రికార్డులు బ్రేక్ చేసింది. ఈ డబ్బింగ్ మూవీని ఏకంగా 145 మిలియన్ల మంది వీక్షించారు. సరైనోడుకి ఐదు లక్షలకి లైకులొచ్చాయి.

 ‘సరైనోడు' కూడా..

‘సరైనోడు' కూడా..

అల్లు అర్జున్ నటించిన డీజే కూడా హిందీ వాళ్లకు తెగ నచ్చేసింది. ఆ మూవీకి కూడా 199 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. 6.07 లక్షల లైకులు వచ్చాయి. దీంతో వరుసగా రెండు సినిమాలకు యూట్యూబ్‌లో 150 మిలియన్లకుపైగా వ్యూస్ సంపాదించిన హీరోగా బన్నీ రికార్డులకెక్కాడు. దీంతో బన్నీ అభిమానులు ఖుషీ అయిపోతున్నారు.

హిందీలో మంచి ఫాలోయింగ్

హిందీలో మంచి ఫాలోయింగ్

బన్నీ సినిమాలకు హిందీలో కూడా మంచి ఫాలోయింగ్ ఉందని చెప్పడానికి ఇదే నిదర్శనం. అందుకే అతడి సినిమా హిందీ డబ్బింగ్ హక్కులకు భారీ డిమాండ్ ఉంటుంది. గతంలో కూడా కొన్ని సినిమాలు మంచి వ్యూస్ సాధించాయి. దీంతో నిర్మాతలు ఈ విధంగా కూడా క్యాష్ చేసుకుంటున్నారు.

ప్రస్తుతం చేస్తున్న సినిమా

ప్రస్తుతం చేస్తున్న సినిమా

‘జులాయి', ‘సన్నాఫ్ సత్యమూర్తి' వంటి సూపర్ హిట్ చిత్రాల తర్వాత అల్లు అర్జున్ - త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో మరో సినిమా వస్తున్న విషయం తెలిసిందే. గీతా ఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. సంక్రాంతి కానుకగా రాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X