లిప్ లాక్ ఇచ్చిన హీరోయిన్ ను బ్లాక్ చేసిన అల్లు అర్జున్.. స్క్రీన్ షాట్ వైరల్.. చివరికీ అలా!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన డ్యాన్స్, యాక్టింగ్ తో తెలుగు రాష్ట్రాల ప్రజల్లో స్టైలిష్ స్టార్ గా ఎంతోకాలంగా ముద్ర వేసుకున్నాడు. ఇటీవల పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. అలాగే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాడు. ఈ సినిమాలో బన్నీ నటన, స్వాగ్, డైలాగ్స్, డ్యాన్స్ స్టెప్పులకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఇప్పుడు పుష్ప 2 చిత్రీకరణ జరుగుతోంది. అంచనాలకు తగినట్లుగా సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ షూటింగ్ లో బన్నీ పాల్గొంటున్నాడు. అయితే ఇటీవల అల్లు అర్జున్ కు సంబంధించిన ఓ పోస్ట్ వైరల్ గా మారింది. ఇదివరకు లిప్ లాక్ ఇచ్చిన హీరోయిన్ ను బన్నీ బ్లాక్ చేశాడనే వార్త చక్కర్లు కొట్టింది.

ఆర్య సినిమాతో..
ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కుమారుడిగా తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టాడు అల్లు అర్జున్. దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వచ్చిన గంగోత్రి సినిమాతో హీరోగా తెరంగేట్రం చేసిన అల్లు అర్జున్ తొలి సినిమాతోనే మంచి హిట్ కొట్టాడు. ఆ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఆర్య మూవీతో ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడు. ఇక పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన దేశముదురు సినిమాతో స్టార్ డమ్ తెచ్చుకున్నాడు.

అదిరిపోయే స్టెప్పులతో..
అనేక చిత్రాలతో అదరగొట్టిన అల్లు అర్జున్ 2021లో వచ్చిన పుష్ప మూవీతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమా ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చెసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో క్యాస్టింగ్ నుంచి మూవీ టేకింగ్, స్క్రీన్ ప్లే, డైలాగ్ లు, నటీనటుల యాక్టింగ్ ఒక్కో డైమండ్ అన్నంత టాక్ తెచ్చుకుంది. ఇక సమంత అదిరిపోయే స్టెప్పులేసిన స్పెషల్ సాంగ్ సినిమాను నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్లింది.

గుణ శేఖర్ చిత్రంలో..
మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన 'పుష్ప: ది రైజ్' చిత్రానికి ఇప్పుడు సీక్వెల్ రాబోతుంది. 'పుష్ప: ది రూల్' చిత్రీకరణలో జోరుగా పాల్గొంటున్నాడు బన్నీ. ఈ క్రమంలో ఇదివరకు తన సినిమాలో చేసిన హీరోయిన్ ను అల్లు అర్జున్ బ్లాక్ చేసినట్లు ఓ పోస్ట్ వైరల్ అయింది. ప్రముఖ దర్శకుడు గుణ శేఖర్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన వరుడు సినిమా గుర్తుండే ఉంటుంది. ఇందులో హీరోయిన్ గా భానుశ్రీ మెహ్రా చేసింది.

డిజాస్టర్ టాక్ తో..
2010లో వచ్చిన వరుడు మూవీ ఐదు రోజుల పెళ్లి కాన్సెప్టుతో తెరకెక్కగా.. మూవీ విడుదల అయ్యేవరకు హీరోయిన్ ఎవరనేది చెప్పకుండా క్యూరియాసిటీ పెంచారు. ఈ సినిమాలో భానుశ్రీ మెహ్రాతో ఘాటు లిప్ లాక్ సీన్ లో నటించాడు అల్లు అర్జున్. అయితే బాక్సాఫీస్ వద్ద మాత్రం ఈ సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. దీంతో ముద్దుగుమ్మ భానుశ్రీ మెహ్రాకు తెలుగులో అవకాశాలు రాలేదు. రెండేళ్లకు సపోర్టింగ్ రోల్స్ చేస్తూ సందడి చేసింది ఈ బ్యూటి.
స్క్రీన్ షాట్ తీసి మరి..
ప్రస్తుతం యూట్యూబ్ లో క్రియేటర్ గా మారిపోయిన భానుశ్రీ తన ఛానెల్ లో ఫన్నీ వీడియోలు చేస్తోంది. ఈ క్రమంలోనే ప్రజల అటెన్షన్ డ్రా చేసేందుకు తన వీడియోలను సెలబ్రిటీలకు ట్యాగ్ చేస్తూ సబ్ స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతోంది. ఇదే క్రమంలో తన కొత్త వీడియో పోస్టును అల్లు అర్జున్ కు ట్యాగ్ చేస్తూ తనను బన్నీ బ్లాక్ చేసిన విషయాన్ని స్కీన్ షాట్ తీసి మరి చూపించింది.
స్ట్రగుల్స్ ఎదుర్కుంటున్నా..
"నేను ప్రస్తుతం మీకు గుర్తుండకపోవచ్చు. కానీ అల్లు అర్జున్ తో వరుడు సినిమాలో నటించాను. ఆ తర్వాత అవకాశాలు లేక వేరే సినిమా చేయలేకపోయాను. కెరీర్ లో స్ట్రగుల్స్ ఎదుర్కొంటున్న సమయంలోనే లైఫ్ ను ఎలా లీడ్ చేయాలో నేర్చుకున్నాను. అయితే ఇప్పుడు అల్లు అర్జున్ నన్ను ట్విట్టర్ లో బ్లాక్ చేశారు. ఏదేమైనా ముందుగా నా ఛానెల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి" అని పోస్ట్ చేసింది భానుశ్రీ మెహ్రా. దీంతో ఈ పోస్ట్ వెంటనే వైరల్ కాగా.. ఫ్యాన్స్ ఆశ్చర్యపోయారు.

నవ్వులు పంచే కంటెంట్..
అయితే చివరికీ భానుశ్రీని అల్లు అర్జున్ అన్ బ్లాక్ చేయడం విశేషం. ఈ విషయాన్ని కూడా పోస్ట్ ద్వారా పంచుకుంది భానుశ్రీ. "గ్రేట్ న్యూస్. అల్లు అర్జున్ నన్ను అన్ బ్లాక్ చేశాడు. నా కెరీర్ వైఫల్యాలకు అల్లు అర్జున్ ను నేను నిందించలేదు. స్ట్రగుల్స్ నుంచి లైఫ్ ను పర్ఫెక్ట్ గా లీడ్ చేయడం నేర్చుకుని ముందుకు సాగుతున్నాను. ఇంకా మరిన్ని నవ్వులు పంచే కంటెంట్ కోసం చూస్తూనే ఉండండి" అని రాసుకొచ్చిన భానుశ్రీ అల్లు అర్జున్ స్పోర్టీవ్ నెస్ కు థ్యాంక్స్ చెప్పింది.


Click it and Unblock the Notifications











