సైలెంట్ గా పెద్ద దర్శకులను లైన్ లో పెడుతున్న అల్లు అర్జున్.. మొత్తం ఆరు సినిమాలు
స్టైలిష్ స్టార్ ట్యాగ్ నుంచి ఐకాన్ స్టార్ గా వెలుగుతున్న అల్లు అర్జున్ పుష్ప సినిమాతో నెవర్ బిఫోర్ అనేలా రెడీ అవుతున్న విషయం తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ సినిమా కోసం అభిమానులతో పాటు సినీ ప్రముఖులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఆ తరువాత వెంటనే మరొక టైటిల్ తో పుష్ప 2ను కూడా విడుదల చేయనున్నారు.
మొత్తంగా అల్లు అర్జున్ లైనప్ ఇప్పుడు చాలా బలంగా ఉంది. పెద్ద దర్శకులనే సెట్ చేస్తున్నాడు. పుష్పతో కలిపి మొత్తం 6 సినిమాలు ఫిక్స్ అయినట్లు లెక్క. పుష్ప రెండు బాగాల అనంతరం ప్లాన్ ప్రకారం కొరటాల శివ సినిమా చేయాలి. కానీ ఎన్టీఆర్ మధ్యలోకి రావడం వలన కొరటాల ఇప్పట్లో దొరకడు కానీ సినిమా మాత్రం పక్కా ఉంటుంది. ఇక వకీల్ సాబ్ డైరెక్టర్ వేణు శ్రీరామ్ తో ఐకాన్ అనే స్టోరీ ఫిక్స్ అయిన విషయం తెలిసిందే.

పాన్ ఇండియా ఆలోచనతో వెళుతున్న బన్నీ ఆ లోకల్ కథను ఓకే చేస్తాడా లేదా అన్నది అనుమానమే. ఇక బోయపాటితో మాత్రం మరో సినిమా చేయాలని ఎప్పటి నుంచో ఒక కమిట్మెంట్ అయితే ఉంది. కానీ కథ పూర్తి స్థాయిలో ఫిక్స్ అవ్వలేదు. మరోవైపు ప్రశాంత్ నీల్ కూడా ఇదివరకే గీతా ఆర్ట్స్ లో బన్నీని కలిశాడు. భవిష్యత్తులు అన్ని అనుకున్నట్లుగా జరిగితే బన్నీ నుంచి పెద్దగా గ్యాప్ లేకుండా వరుసగా 6 సినిమాలు వచ్చినట్లే.


Click it and Unblock the Notifications











