Pushpa Leak: ఇండియాలోనే బిగ్గెస్ట్ బోట్ ఫైట్.. బడ్జెట్ లో కూడా తగ్గేదేలే
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఎలాంటి సినిమా తెరకెక్కించినా కూడా ప్రేక్షకుల మెదడుకు ఎంతో కొంత పని పెడుతుంటాడు. రంగస్థలం లాంటి కమర్షియల్ డ్రామాలో కూడా విభిన్నమైన యాక్షన్ ఎపిసోడ్స్ ను ట్రై చేసి స్క్రీన్ ప్లే మాస్టర్ అనిపించుకున్నారు. ఇక ఇప్పుడు పుష్ప సినిమాతో మాత్రం ఫుల్ యాక్షన్ తో కిక్కిచ్చేలా ఉన్నట్లు తెలుస్తోంది.

ఇంతకుముందు ఎప్పుడూ లేని విధంగా
సుకుమార్ అల్లు అర్జున్ కాంబినేషన్ అనగానే మరో ఆర్య లాంటి సినిమాతో వస్తారని అంతా బావించారు. కానీ ఊహించని విధంగా ఈ దర్శకుడు ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో ఒక హేవి యాక్షన్ కథను సెలెక్ట్ చేసుకోవడం అందరిని ఆశ్చర్యపరిచింది. ఇంతకుముందు ఎప్పుడు కూడా సుకుమార్ ఈ రేంజ్ లో ప్రయోగాలు చేయలేదు.

సినిమాలో భారీ బోట్ ఫైట్
పైగా మొదటిసారి చేస్తున్న పాన్ ఇండియా సినిమా కాబట్టి సుకుమార్ తన క్రియేటివిటీ మొత్తం ఈ సినిమాపై వాడబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే నెవర్ బిఫోర్ అనేలా యాక్షన్ ఎపిసోడ్స్ కూడా ఉంటాయట. ప్రస్తుతం ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ప్రకారం ఒక సముద్రంలో జరిగే బోట్ ఫైట్ సినిమా మొత్తానికే హైలెట్ గా నిలుస్తుందని టాక్ వస్తోంది.

బడ్జెట్ ఎంత పెరిగినా కూడా తగ్గట్లేదు
టాప్ మోస్ట్ ఫైట్ కొరియోగ్రాఫర్స్ ను సెలెక్ట్ చేసుకున్న సుకుమార్ ఇంతకుముందెన్నడు కూడా చూడని ఒక బోట్ ఫైట్స్ ను చూపిస్తారట. అందుకోసం నిర్మాతలు కూడా భారీగానే ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. బడ్జెట్ ఎంత పెరిగినా కూడా ఏ మాత్రం పట్టించుకోవడం లేదట. మైత్రి మూవీ మేకర్స్ చాలా నమ్మకంతో సినిమాను రూపొందిస్తున్నట్లు అనిపిస్తోంది.
Recommended Video

నిజంగానే షాక్ ఇచ్చేలా ఉన్నారు
అయితే ఆ బోట్ సీన్ ఫస్ట్ పార్ట్ లో ఉంటుందా లేదా సెకండ్ పార్ట్ లో ఉంటుందా అనేది తెలియాల్సి ఉంది. సినిమాలో యాక్షన్ సెక్వెన్స్ కు స్పెస్ ఎక్కువగా దొరకడం వలన సుకుమార్ భారీ ప్లాన్స్ తో సిద్ధమవుతున్నాడు. బుచ్చిబాబు అన్నట్లుగానే ఈ సినిమా 10 KGF లతో సమానంగా ఉంటుందని అనిపిస్తోంది. ఇక సినిమా మొదటి భాగాన్ని వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రావచ్చని సమాచారం.


Click it and Unblock the Notifications











