మారుతున్న అల్లు అర్జున్ లెక్కలు.. RRR హీరోల తరహాలోనే బిగ్ ప్లాన్స్!

స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ మొత్తానికి బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో సక్సెస్ అందుకున్నాడు. 2020లో అల..వైకుంఠపురములో సినిమాతో ఆ యేడాది అత్యధిక స్థాయిలో కలెక్షన్స్ అందుకున్న హీరోగా ఒక రికార్డును క్రియేట్ చేసిన బన్నీ 2021లో కూడా అదే తరహాలో సక్సెస్ ను కంటిన్యూ చేశాడు. పుష్ప సినిమా 300 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ అందుకున్నట్లుగా నిర్మాతలు ప్రచారాలు కొనసాగిస్తున్నారు. మొత్తానికి బ్యాక్ టు బ్యాక్ ఇయర్స్ బాక్సాఫీస్ హిట్స్ అందుకున్న బన్నీ అదే తరహాలో తన కెరీర్ ను కొనసాగించాలని అనుకుంటున్నాడు. హిందీలో అయితే బన్నీకి 50 కోట్ల మార్కెట్ ఉన్నట్లు చాలా క్లియర్ గా క్లారిటీ వచ్చేసింది.

16వ రోజు కూడా పుష్ప సినిమాకు బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద 6 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రావడం అంటే అంత సాధారణమైన విషయం కాదు. కాబట్టి రానున్న రోజుల్లో బన్నీకి బాలీవుడ్లో కూడా భారీ స్థాయిలో ఆఫర్స్ వస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. అంతే కాకుండా బన్నీ అటువైపు ఫోకస్ చేస్తే మాత్రం తప్పకుండా అతనికి మంచి మార్కెట్ అయితే క్రియేట్ అవుతుంది. అయితే తదుపరి సినిమాల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ప్రస్తుతం అయితే పుష్ప సినిమా సీక్వెల్ తో పాటు ఐకాన్ సినిమాను కూడా పూర్తిచేయాల్సి ఉంది. సినిమా రెండవ భాగం షూటింగ్ అయితే దాదాపు తుది దశలోనే ఉంది.

Allu arjun upcoming projects pan india plans,

కేవలం 20 శాతం మాత్రమే మిగిలి ఉంది. అయితే ఐకాన్ సినిమాను వేణు శ్రీరామ్ దర్శకత్వంలో చేస్తాడా లేదా అనేది హాట్ టాపిక్ గా మారింది. అలాగే బోయపాటి శ్రీను దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేయబోతున్నట్లు క్లారిటీ అయితే వచ్చేసింది. కొరటాల శివతో కూడా ఒక కమిట్మెంట్ అయితే ఉంది. కానీ ఆ సినిమా ఎప్పుడో సెట్స్ పైకి వస్తుందో చెప్పలేము. వీలైనంత వరకు బన్నీ నుంచి రాబోయే ప్రాజెక్టులు అన్ని కూడా పాన్ ఇండియా రేంజ్ కు తగ్గట్టుగా రూపొందనున్నట్లు అర్ధమవుతోంది.

ప్రస్తుతం RRR హీరోలు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు కూడా వారి భవిష్యత్తు ప్రాజెక్టులను పాన్ ఇండియా మార్కెట్కు తగ్గట్టుగానే తెరపైకి తీసుకు రాబోతున్నారు. ఇక అల్లు అర్జున్ కూడా అదే బాటలో కొనసాగుతున్నాడు ప్రభాస్ తర్వాత మరో ముగ్గురు హీరోలు కూడా పాన్ ఇండియా మార్కెట్ ను ఎలబోతున్నట్లు చాలా క్లారిటీ గా అర్థం అవుతోంది. ఇక ప్రస్తుతం పుష్ప సినిమాకు 40 కోట్ల వరకు పారితోషికం అందుకున్న అల్లు అర్జున్ ఆ తర్వాత చేయబోయే సినిమాలకు 50 కోట్లకు పైగానే డిమాండ్ చేయనున్నట్లుగా కథనాలు వెలువడుతున్నాయి. ఏదేమైనా కూడా బన్నీ తన కెరీర్ పక్కా ప్రణాళికలతో ముందుకు తీసుక వెళుతున్నాడు. కేవలం దర్శకుడి పాత్ర మాత్రమే కాకుండా తన కష్టం కూడా వందకి వంద శాతం ఉండేలా చూసుకుంటున్నాడు. మరి రానున్న రోజుల్లో బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తాడో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X