కోలీవుడ్‌కు అల్లు అర్జున్.. విక్రమ్ కుమార్ చిత్రంలో టాప్ హీరోయిన్‌తో..
Hero
oi-Rajababu
By Rajababu
|
నా పేరు సూర్య.. నా పేరు ఇండియా సినిమా తర్వాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చాలానే గ్యాప్ తీసుకొన్నారు. ఆ చిత్రానికి మిశ్రమ స్పందన వ్యక్తం కావడంతో తదుపరి చిత్రంపై ఆచీతూచీ అడుగు వేశాడు. ప్రస్తుతం మనం చిత్రం దర్శకుడు విక్రమ్ కుమార్‌తో జతకట్టారనేది సినీ వర్గాల సమాచారం. త్వరలోనే ఈ చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నట్టు తెలిసింది. ఈ చిత్రానికి సంబంధించిన వివరాలను త్వరలోనే చిత్ర యూనిట్ వెల్లడించనున్నట్టు తెలుస్తున్నది.
ఈ చిత్రంలో హీరోయిన్గా సమంతను తీసుకోవడానికి ఆమెతో చిత్ర నిర్మాతలు సంప్రదించినట్టు సినీవర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతున్నది. అయితే ఈ సినిమాలో నటించేందుకు సమంత సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తున్నది. త్వరలోనే సమంత చేరికపై చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన చేయనున్నట్టు సమాచారం.
విక్రమ్ కుమార్‌తో సినిమా ప్లాన్ చేస్తూనే.. తమిళ చిత్ర పరిశ్రమలో నేరుగా అడుగుపెట్టేందుక ప్రయత్నాలు చేస్తున్నారు. లింగుసామి దర్శకత్వంలో మరో చిత్రంలో నటించడానికి స్టైలిష్ స్టార్ సిద్దంగా ఉన్నట్టు సమాచారం.
ఇక సమంత విషయానికి వస్తే యూటర్న్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ 13న రిలీజ్‌కు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఏడాది మహానటి, రంగస్థలం, అభిమన్యుడు బ్లాక్ బస్టర్ల తర్వాత సమంత నటించిన చిత్రం కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.
After Naa peru Surya.. Na illu India, Allu Arjun is prepping for his role in the film which will be directed by Vikram K Kumar. makers are contemplating to sign on Samantha Akkineni for this yet untitled film and will soon approach the Rangsthalam actress for this.
Story first published: Friday, September 7, 2018, 21:15 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more