బన్నీ సినిమా గురించి మరో క్రేజీ న్యూస్.. అప్పటివరకు నిరీక్షణే!
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చివరగా నటించిన నా పేరు సూర్య చిత్రం వేసవిలో విడుదలై నిరాశ పరిచింది. ఆ చిత్రం వచ్చిన చాలా రోజులు గడుస్తున్నా నెక్స్ట్ మూవీ విషయంలో బన్నీ మౌనంగానే ఉంటున్నాడు. అల్లు అర్జున్ నెక్స్ట్ మూవీ గురించి ఇంతవరకు ఎలాంటి అప్డేట్ లేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం బన్నీ గురించి వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి.
విక్రమ్ కుమార్ దర్శకతంలో బన్నీ తదుపరి చిత్రం ఉంటుందనే వార్తలు ఇటీవల బలంగా వినిపిస్తున్నాయి. తాజగా ఆ ప్రాజెక్ట్ కూడా పక్కకు వెళ్లిందనే న్యూస్ వినిపిస్తోంది. నా పేరు సూర్య చిత్రం నిరాశ పరిచిన తరువాత తప్పనిసరిగా హిట్ కొట్టాలనే పట్టుదలతో అల్లు అర్జున్ ఉన్నాడు. కమర్షియల్ గా వర్కౌట్ అవుతుందా అనే డౌట్ తోనే విక్రమ్ కుమార్ చిత్రాన్ని ప్రక్కన పెట్టేసినట్లు వార్తలు వస్తున్నాయి.

ప్రస్తుతం అల్లు అర్జున్ చూపంతా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ పై ఉన్నట్లు తెలుస్తోంది. వీరిద్దరి కాంబినేషన్ లో గతంలో జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి వంటి చిట్ చిత్రాలు వచ్చాయి. త్రివిక్రమ్ తదుపరి చిత్రాల జాబితాలో అల్లు అర్జున్ కూడా ఉన్నాడు. కానీ అరవింద సమేత తరువాత త్రివిక్రమ్ చిత్రం ఎవరితో అనే విషయం ఖరారు కాలేదు. అరవింద సమేత చిత్రం సెప్టెంబర్ నాటికీ పూర్తి కాబోతోంది. దీనితో త్రివిక్రమ్ ని లైన్ లో పెట్టాలని బన్నీ భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.


Click it and Unblock the Notifications











