twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రౌడీ దుస్తుల్లో స్టైలీష్ స్టార్.. బన్నీ పిక్స్ వైరల్

    |

    టాలీవుడ్ స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. స్టైలీష్ స్టార్ అనే ట్యాగ్ సంపూర్ణ న్యాయం చేసే నటుడు. కేవలం తెరపైనే కాకుండా సోషల్ మీడియాలోనూ స్టైల్‌కు ఐకాన్‌లా ఉంటాడు. అలాంటి అల్లు అర్జున్‌కు విజయ్ దేవరకొండ లాంటి యూత్ ఐకాన్ సపరేట్‌గా డ్రెస్ డిజైన్ చేసి పంపిస్తే ఇంకెలా ఉంటుందో చెప్పనక్కర్లేదు. తాజాగా రౌడీ బట్టల్లో బన్నీ ఫోటోలు బయటకు వచ్చాయి.

    రౌడీ బ్రాండ్‌ను ముందు నుంచి బన్నీ ఎంకరేజ్ చేస్తూనే ఉన్నాడు. ఆ మధ్య ఓ సారి అందరి ముందు స్టేజ్ మీద రౌడీ బ్రాండ్‌ను ప్రశంసల్లో ముంచెత్తాడు. తనకు కూడా ఓ డ్రెస్ డిజైన్ చేసి ఇవ్వమని విజయ్‌ని బన్నీ కోరాడు. అయితే మధ్యలో విజయ్ దేవరకొండ బన్నీ కోసం స్పెషల్ బట్టలను పంపాడు. అప్పట్లో అవి బాగానే వైరల్ అయ్యాయి. తాజాగా మరోసారి బన్నీ కోసం రౌడీ బట్టలు పంపినట్టున్నాడు.

    Allu Arjun Wear Vijay Devarakonda Rowdy Brand

    బన్నీ రౌడీ బట్టలను ధరించి అదిరిపోయే లుక్కులో దర్శనమిచ్చాడు. అసలు పుష్ప రాజ్ గెటప్పులు బన్నీ హెయిర్ స్టైల్ అదిరిపోగా.. రౌడీ బట్టలు కూడా అదనపు ఆకర్షణలా మారిపోయింది. అలా బన్నీ రౌడీ బట్టలను ధరించి ఫోటోలు షేర్ చేస్తూ విజయ్ దేవరకొండకు థ్యాంక్స్ చెప్పాడు. ఇలాంటి కూల్ జతను పంపింనందుకు నా సోదరుడు విజయ్ దేవరకొండకు థ్యాంక్స్ చెప్పాలి.. సూపర్‌గా ఉందంటూ రౌడీ బ్రాండ్‌ను అలా ప్రమోట్ చేసేశాడు.

    English summary
    Allu Arjun Wear Vijay Devarakonda Rowdy Brand, I want to thank my brother Vijay Deverakonda and the Rowdy Club team for sending me this cool pair . It’s super comfy . Thank you for the lovely gesture my brother . Shine on !
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X