Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్‌మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
రౌడీ దుస్తుల్లో స్టైలీష్ స్టార్.. బన్నీ పిక్స్ వైరల్
టాలీవుడ్ స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. స్టైలీష్ స్టార్ అనే ట్యాగ్ సంపూర్ణ న్యాయం చేసే నటుడు. కేవలం తెరపైనే కాకుండా సోషల్ మీడియాలోనూ స్టైల్‌కు ఐకాన్‌లా ఉంటాడు. అలాంటి అల్లు అర్జున్‌కు విజయ్ దేవరకొండ లాంటి యూత్ ఐకాన్ సపరేట్గా డ్రెస్ డిజైన్ చేసి పంపిస్తే ఇంకెలా ఉంటుందో చెప్పనక్కర్లేదు. తాజాగా రౌడీ బట్టల్లో బన్నీ ఫోటోలు బయటకు వచ్చాయి.
రౌడీ బ్రాండ్‌ను ముందు నుంచి బన్నీ ఎంకరేజ్ చేస్తూనే ఉన్నాడు. ఆ మధ్య ఓ సారి అందరి ముందు స్టేజ్ మీద రౌడీ బ్రాండ్‌ను ప్రశంసల్లో ముంచెత్తాడు. తనకు కూడా ఓ డ్రెస్ డిజైన్ చేసి ఇవ్వమని విజయ్‌ని బన్నీ కోరాడు. అయితే మధ్యలో విజయ్ దేవరకొండ బన్నీ కోసం స్పెషల్ బట్టలను పంపాడు. అప్పట్లో అవి బాగానే వైరల్ అయ్యాయి. తాజాగా మరోసారి బన్నీ కోసం రౌడీ బట్టలు పంపినట్టున్నాడు.
బన్నీ రౌడీ బట్టలను ధరించి అదిరిపోయే లుక్కులో దర్శనమిచ్చాడు. అసలు పుష్ప రాజ్ గెటప్పులు బన్నీ హెయిర్ స్టైల్ అదిరిపోగా.. రౌడీ బట్టలు కూడా అదనపు ఆకర్షణలా మారిపోయింది. అలా బన్నీ రౌడీ బట్టలను ధరించి ఫోటోలు షేర్ చేస్తూ విజయ్ దేవరకొండకు థ్యాంక్స్ చెప్పాడు. ఇలాంటి కూల్ జతను పంపింనందుకు నా సోదరుడు విజయ్ దేవరకొండకు థ్యాంక్స్ చెప్పాలి.. సూపర్‌గా ఉందంటూ రౌడీ బ్రాండ్‌ను అలా ప్రమోట్ చేసేశాడు.