గోవా వెళ్లబోతున్న అల్లు అర్జున్: ఐకాన్ స్టార్‌తో అక్కడేం ప్లాన్ చేశారబ్బా

గత ఏడాది ఆరంభంలోనే 'అల.. వైకుంఠపురములో' అనే సినిమాతో ఇండస్ట్రీ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఈ ఉత్సాహంతోనే వెంటనే లెక్కల మాస్టారు సుకుమార్ కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఇది 'పుష్ప' అనే టైటిల్‌తో మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోంది. గంథపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంతో రూపొందే ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో రానుంది. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ చాలా వరకూ పూర్తైంది. ఈ క్రమంలోనే ఓ కీలకమైన షెడ్యూల్ కోసం చిత్ర యూనిట్ త్వరలోనే గోవా వెళ్లబోతున్నట్లు ఓ న్యూస్ లీకైంది.

'పుష్ప' మూవీ రెండు భాగాలుగా విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. మొదటి పార్ట్‌కు సంబంధించి ఇప్పటికే దాదాపు ఎనభై శాతం షూటింగ్ కంప్లీట్ అయింది. మిగిలిన దాని కోసం జూలైలో చిత్రీకరణను పున: ప్రారంభించబోతున్నారు. ఇందుకోసం హైదరాబాద్‌లో ఎప్పుడో సెట్‌ను కూడా నిర్మించారు. దీని తర్వాత ఓ కీలకమైన ఎపిసోడ్‌ కోసం గోవాలో మరో షెడ్యూల్ ప్లాన్ చేశారు. దాదాపు వారం నుంచి పది రోజల పాటు సాగే దీని కోసం బన్నీ సహా కొందరు సభ్యులు అక్కడకు వెళ్తారని తెలుస్తోంది. ఈ షెడ్యూల్‌లో హీరోయిన్, విలన్ ఉండరనే టాక్ వినిపిస్తోంది.

 Allu Arjun Will Go Goa for Pushpa Shoot

ప్రస్తుతానికి గోవాలో షూటింగ్‌లపై నిషేదం కొనసాగుతోంది. త్వరలోనే ఇది తీసేసే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాతనే 'పుష్ప' యూనిట్ అక్కడకు వెళ్తుందని తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. కన్నడ పిల్ల రష్మిక మందన్నా ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది. మలయాళ హీరో ఫహద్ ఫాసిల్ విలన్‌గా చేస్తున్నాడు. దేవీ శ్రీ ప్రసాద్ దీనికి సంగీతం అందిస్తున్నాడు. అనసూయ కీలక పాత్రను పోషిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X