బరువు తగ్గమని చెప్పిన త్రివిక్రమ్ శ్రీనివాస్!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ చిత్రం రాబోతున్న సంగతి తెలిసిందే. అల్లు అరవింద్, రాధాకృష సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఫిబ్రవరిలో ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రాన్ని దసరా కానుకగా విడుదల చేయాలనేది త్రివిక్రమ్ ప్లాన్ గా చెబుతున్నారు. మొదట బన్నీ లేకుండానే త్రివిక్రమ్ షూటింగ్ ని ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.

ఈ లోపు అల్లు అర్జున్ తన లుక్ మార్చుకునే పనిలో ఉంటాడట. ఈ చిత్రం కోసం బరువు తగ్గి మరింత స్టైలిష్ గా మారాలని త్రివిక్రమ్ బన్నీకి సూచించినట్లు తెలుస్తోంది. దీనితో అల్లు అర్జున్ తన లుక్ మార్చుకునే పనిలో నిమగ్నమైనట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి చిత్రాలు విజయం సాధించాయి. దీనితో ఈ మూడవ చిత్రంపై ఇప్పటి నుంచే మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

Allu Arjun will going to loss weight fo Trivikram srinivas movie

ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ అల్లు అర్జున్ కు సరైన జోడీగా ఉండే హీరోయిన్ కోసం వెతుకుతున్నట్లు తెలుస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీత దర్శత్వం వహించే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి కానీ ఇంకా ఖరారు చేయలేదు. ప్రతి చిత్రానికి విభిన్నమైన లుక్ లో కనిపించే బన్నీ ఈ చిత్రం కోసం ఎలాంటి గెటప్ లో కనిపిస్తాడనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X