AAA Cinemas: అల్లు అర్జున్ వరల్డ్ క్లాస్ థియేటర్.. ప్రత్యేకతలు, ప్రదర్శించే తొలి చిత్రం ఏంటో తెలుసా?

మెగా కాంపౌండ్ నుంచి వచ్చి అనతి కాలంలోనే స్టార్ హీరోగా సత్తా చాటాడు అల్లు అర్జున్. చిరంజీవి విజేత, కమల్ హాసన్ స్వాతి ముత్యం సినిమాలతో బాల నటుడిగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన బన్నీ దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు డైరెక్ట్ చేసిన గంగోత్రి మూవీతో హీరోగా డెబ్యూ ఇచ్చాడు. తర్వాత ఆర్యతో స్టైలిష్ స్టార్ అనిపించుకున్న అల్లు అర్జున్ పుష్ప సినిమాతో గ్లోబల్ స్టార్ గా ఎదిగాడు. హీరోగా రాణిస్తున్న బన్నీ బిజినెస్ లోకి దిగాడు. వరల్డ్ క్లాస్ థియేటర్ ను నిర్మించాడు. ఆ థియేటర్ వివరాల్లోకి వెళితే..

వ్యాపార రంగం : ప్రస్తుతం సౌత్ సినీ ఇండస్ట్రీలో స్టార్ గా వెలుగొందుతున్నాడు అల్లు అర్జున్. సుమారు రూ. 100 కోట్ల పారితోషికం తీసుకునే నటుల జాబితాలో పుష్ప 2 ద్వారా ఆయన చేరినట్లు వార్తలు వస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా కేరళలో బన్నీకి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. స్టైలిష్ స్టార్ గా పేరొందిన అల్లు అర్జున్ తాజాగా వ్యాపార రంగంలోకి ఎంట్రీ ఇచ్చాడు. భాగస్వామ్యంతో వరల్డ్ క్లాస్ థియేటర్ ను నెలకొల్పాడు.

Allu Arjun

జూన్ 15న: హైదరాబాద్ లోని అమీర్ పేట్ లో సత్యం థియేటర్ చాలా పాపులర్ అని తెలిసిందే. ఇప్పుడు ఆ థియేటర్ ఉన్న ప్లేసులో ఏషియన్ సత్యం మాల్ వెలిసింది. ఇందులో అల్లు అర్జున్ భాగస్వామ్యంతో ఏఏఏ సినిమాస్ (AAA Cinemas) పేరుతో వరల్డ్ క్లాస్ థియేటర్ ను నిర్మించారు. ఈ థియేటర్ జూన్ 15న ప్రారంభం కానుంది. తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, అల్లు అర్జున్ ఈ థియేటర్ ను ప్రారంభించనున్నారు.

Allu Arjun

ఐదు స్క్రీన్స్: ఈ ఏషియన్ సత్యం మాల్ లో అల్లు అర్జున్, ఏషియన్ సునీల్ నారంగ్, భరత్ నారంగ్, మురళి మోహన్, సదానంద్ గౌడ్ భాగస్వాములుగా ఉన్నారు. మూడు లక్షల చదరపు అడుగుల్లో రూపొందిన ఈ మాల్ లో 3 ఫోర్ల పార్కింగ్ ఉండనుంది. ఏఏఏ ఫుడ్ కోర్ట్ మూడో ఫ్లోర్ లోనూ, ఏఏఏ సినిమాస్ నాలుగో అంతరస్థులో ఉండనున్నాయి. ఏఏఏ సినిమాస్ లో మొత్తం ఐదు స్క్రీన్ లు ఉండనున్నాయి. వీటిలో మొదటి స్క్రీన్ 67 అడుగులు ఎత్తు ఉంటుందట.

వరల్డ్ క్లాస్ ఫీచర్స్:

ఈ 67 అడుగుల ఎత్తు గల స్క్రీన్ లో బార్కో లేజర్ ప్రొజెక్షన్, అట్మాస్ సౌండ్ వంటి వరల్డ్ క్లాస్ ఫీచర్లు ఉండనున్నాయి. స్క్రీన్ 2లో ఎపిక్ లక్సాన్ స్క్రీన్ ఉండనుంది. ఇది కూడా అట్మాస్ సౌండ్ తోనే రానుంది. మిగతా స్క్రీన్లన్నీ 4కే ప్రొజెక్షన్ తో రానున్నాయి. డాల్బీ 7.1 సౌండ్ సిస్టమ్ కూడా ఉండనుంది.

తొలి చిత్రం: జూన్ 14వ తేది నుంచి పూజా కార్యక్రమాలు జరగనున్నాయి. జూన్ 15వ తేదిన మాల్, సినిమాస్, ఫుడ్ కోర్ట్ ప్రారంభం కానున్నాయి. జూన్ 16న విడుదల కానున్న ప్రభాస్ ఆదిపురుష్ సినిమా ఇందులో ప్రదర్శితం కానుంది. దీంతో ఏఏఏ సినిమాస్ లో ప్రదర్శించబడే తొలి చిత్రంగా ఆదిపురుష్ నిలవనుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X