టాలీవుడ్ ఫస్ట్ సిక్స్ ప్యాక్‌కు కారణం ఆ హీరోయిన్... అల్లు అర్జున్‌ను రెచ్చగొట్టిన ఆ నటి ఎవరంటే?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న Waves 2025 కార్యక్రమానికి హాజరయ్యారు. ఆ వేదికపై తన సిక్స్ పాక్ గురించి మాట్లాడారు. అసలు తను సిక్స్ ప్యాక్ చేయడానికి అసలు కారణం ఏంటో కూడా వివరించారు. ఒక నటి అలా అన్న మాటలను ఛాలెంజింగ్ తీసుకొని తన సినిమాలో సిక్స్ ప్యాక్ చూపించినట్టు చెప్పుకొచ్చారు.
Waves 2025లో పాల్గొన్న స్టార్ హీరోలు..
దేశాన్ని ప్రపంచంలో కేంద్రంగా నిలిపేందుకు కేంద్ర ప్రభుత్వం Waves 2025 (World Audio Visuval and Entertainment Summit) అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ సమ్మిట్ కు ఇండియాలోని ప్రముఖ స్టార్స్ హాజరయ్యారు. చిరంజీవి, రజనీకాంత్, మోహన్ లాల్, హేమామాలిని, మిథున్ చక్రవర్తితో పాటు యంగ్ హీరోలు అల్లు అర్జున్, రణబీర్ కపూర్ తదితరులు హాజరయ్యారు. తమ కెరీయర్ లో ఎలాంటి ప్రణాళికలు, ఎలాంటి సవాళ్లను ఎదుర్కొన్నారో చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

అల్లు అర్జున్ సిక్స్ ప్యాక్ వెనక జరిగిన కథ..
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం ఎంతటి భారీ చిత్రాల్లో నటిస్తున్నారో తెలిసిందే. టాలీవుడ్ లో రోటీన్ కు భిన్నంగా సినిమాలు చేసే వారిలో అల్లు అర్జున్ పేరు కూడా ముందు వరుసలో ఉంటుంది. ఆయన కెరీయర్ ప్రారంభం నుంచే ఇంట్రెస్టింగ్ సినిమాలు చేస్తూ వచ్చారు. అయితే తాజాగా సమ్మిట్ లో పాల్గొన్న అల్లుఅర్జున్ తన సిక్స్ ప్యాక్ గురించి ఇలా మాట్లాడారు. సౌత్ లో ఫస్ట్ సిక్స్ సాధించిన హీరోగా నిలవడం గర్వంగా ఉంది. అయితే ఒక నటి అన్న మాటలను స్ఫూర్తిగా తీసుకొని సిక్స్ ప్యాక్ చేశానని చెప్పారు. సౌత్ స్టార్స్ సిక్స్ ప్యాక్ చేయలేరు అన్న ఆమె మాటలను వ్యక్తిగతం తీసుకున్నానని అల్లు అర్జున్ చెప్పారు. అందుకే సిక్స్ ప్యాక్ చేసి చూపించానన్నారు.
అల్లు అర్జున్ సిక్స్ చూపించిన చిత్రం..
అల్లు అర్జున్ - పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన 'దేశ ముదురు' చిత్రంలో బన్నీ సిక్స్ ప్యాక్ ను ప్రదర్శించారు. 2007లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆ తర్వాత బన్నీ ఎప్పుడూ షర్ట్ విప్పే పనిరాలేదు. అప్పట్లో సిక్స్ ప్యాక్ లకు మంచి క్రేజ్ ఉండేది. అల్లు అర్జున్ తర్వాత చాలా మంది హీరోలు ఆరు పలకలను ప్రదర్శించడం మొదలు పెట్టారు. నితిన్, ప్రభాస్, సుధీర్ బాబు వంటి వారు వెండితెరపై సిక్ ప్యాక్ చూపించిన సంగతి తెలిసిందే.
అల్లు అర్జున్ నెక్ట్స్ ప్రాజెక్ట్స్..
చివరిగా అల్లు అర్జున్ 'పుష్ప 2 : ది రూల్' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.1870 కోట్లు వసూళ్లు చేసి సంచలనం సృష్టించారు. ప్రస్తుతం తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీతో తన 22వ చిత్రాన్ని చేస్తున్నారు. రూ.800 కోట్ల బడ్జెట్ తో ఆ చిత్రం రూపుదిద్దుకుంటోంది. సన్ పిక్చర్స్ బ్యానర్ నిర్మిస్తోంది. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా ఫైనల్ అయ్యింది. ఇక ఈ ప్రాజెక్ట్ తరువాత త్రివిక్రమ్, సందీప్ రెడ్డి వంగాతో అల్లు అర్జున్ సినిమాలు చేయనున్నారు.


Click it and Unblock the Notifications











