Allu Arjun పుష్ప 2 రిలీజ్ డేట్ గందరగోళం.. ఆ స్టార్ హీరోలను ఢీకొట్టేందుకు అల్లు అర్జున్!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లను రాబట్టింది. సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, రవి శంకర్ నిర్మించిన ఈ చిత్రం ఊహించని విజయాన్ని సొంతం చేసుకొన్నది. అయితే ఈ సినిమాకు సీక్వెల్‌గా రూపొందిన పుష్ప ది రూల్ చిత్రం రిలీజ్‌కు సిద్దమవుతున్నది. ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో తలెత్తిన గందరగోళంపై మైత్రీ నిర్మాతలు వివరణ ఇస్తూ..
అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో పుష్ప సాధారణ బడ్జెట్ చిత్రంగానే మొదలైంది. అయితే ఈ సినిమాకు క్రేజ్, కథ చెప్పడానికి స్పాన్ పెరిగిపోవడంతో రెండు భాగాలుగా రూపొందించాలని నిర్ణయం తీసుకొన్నారు. పార్ట్ 1 కు పుష్ప ది రైజ్ అని, పార్ట్ 2 కు పుష్ప ది రూల్ అనే టైటిల్స్ ఖరారు చేశారు.

పుష్ప ది రైజ్ సినిమాకు ఊహకు అందని రెస్పాన్స్ వచ్చింది. తగ్గేదేలే అనే డైలాగ్ అన్ని భాషల్లో ఐకానిక్ డైలాగ్, సీన్‌గా మారింది. సాధారణ ప్రజల నుంచి ఇంటర్నేషన్ క్రికెటర్లు, ఆటగాళ్లు, పొలిటిషన్ల వరకు ఈ డైలాగ్‌తో కేక పెట్టించారు. దాంతో పార్ట్ 2పై అంచనాలు పెరిగిపోయాయి.
పుష్ప ది రూల్ సినిమా రిలీజ్‌కు మైత్రీ మూవీస్ పక్కాగా ప్లాన్ చేశారు. ఈ సినిమాను పాన్ ఇండియాగా మార్చి ఆగస్టు 15వ తేదీన రిలీజ్ చేయాలని ప్రకటన చేశారు. అయితే తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ మారిపోయింది. ఈ సినిమా విడుదల వాయిదా పడే అవకాశం ఉంది అని మీడియాలో ప్రచారం జరుగుతున్నది. దాంతో నిర్మాతలు క్లారిటీ ఇవ్వడం జరిగింది.
పుష్ప 2 రిలీజ్ డేట్ గురించి స్పందిస్తూ.. 2024 సంవత్సరాన్ని పుష్ప రూల్ చేయడం పక్కా. ఈ సంవత్సరంలోనే ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. అభిమానుల ఆకాంక్షలకు అనుగుణంగా ఈ సినిమా ఉంటుంది. ఆగస్టు 15వ తేదీన పుష్ప 2 రిలీజ్ ఉంటుంది అని మైత్రీ మూవీ మేకర్స్ ట్వీట్ చేశారు.

2024 సంవత్సరం ఆగస్టు 15వ తేదీ నుంచి 5 రోజులు లాస్ట్ వీకెండ్ ఉంది. పుష్ప 2 సినిమాను సెలబ్రేట్ చేసుకోవడానికి సిద్దంగా ఉండండి. ఇది పుష్ప గాడి రూల్ అంటూ అభిమానులు ట్వీట్లు చేసి ఆనందాన్ని పంచుకొన్నారు. అయితే బాలీవుడ్ సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో ఈ సినిమా వాయిదా పడినట్టు వార్తలు రావడంతో యూనిట్ క్లారిటీ ఇచ్చింది.
ఇదిలా ఉండగా, బాలీవుడ్‌లో ఆగస్టు 15వ తేదీన సింగం అగైన్ సినిమా రిలీజ్ అవుతున్నది. పుష్ప సినిమాను ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఢీకొట్టడానికి రెడీ అవుతున్నది. రణ్‌వీర్, అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ కలిసి నటించిన ఈ సినిమాను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 ఎదుర్కోవడానికి సిద్దమవుతుండటం విశేషం. అలాగే సింగమ్ అగైన్ చిత్రంలో కరీనా కపూర్, దీపిక పదుకోన్, జాకీ ష్రాప్, అర్జున్ కపూర్ తదితరులు నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











