ఆరంభంలోనే అదరగొట్టిన అల్లు అర్జున్: ‘పుష్ప’ ప్రీల్యూడ్ వీడియోకు రికార్డు స్థాయి వ్యూస్
గత ఏడాది ఆరంభంలోనే 'అల.. వైకుంఠపురములో' అనే సినిమాతో ఇండస్ట్రీ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. ఈ మూవీ రిజల్ట్ ఇచ్చిన జోష్‌లోనే ఆ వెంటనే సుకుమార్ దర్శకత్వంలో 'పుష్ప' అనే సినిమాను ప్రారంభించేశాడు. గంథపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంతో పాన్ ఇండియా రేంజ్‌లో రాబోతుందీ సినిమా. ఇందులో బన్నీ డీ గ్లామర్ లుక్‌తో దర్శనమిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇప్పటికే తూర్పు గోదావరి జిల్లా మారేడుమిల్లి, రంపచోడవరం అటవీ ప్రాంతంలో కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించారు.
ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న 'పుష్ప' మూవీకి సంబంధించిన 'ప్రీల్యూడ్ ఆఫ్ పుష్పరాజ్' అనే వీడియో శనివారం విడుదలైంది. దీనికి ప్రేక్షకుల నుంచి విశేషమైన స్పందన లభించింది. ఇందులో అల్లు అర్జున్ మాంచి మాస్ లుక్‌తో దర్శనమిచ్చాడు. అతడి ముఖాన్ని కవర్ చేసి చేతులను వెనక్కి కట్టేసి ఎక్కడి నుంచో పారిపోయి వస్తున్నట్లు చూపించారు. ఇక, ఇందులో దేవీ శ్రీ ప్రసాద్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. దీంతో ఈ వీడియోకు రికార్డు స్థాయిలో 24 గంటల్లోనే 3 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. అలాగే, 2 లక్షలకు పైగా లైకులు దక్కాయి.

ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టినరోజు. దీనిని పురస్కరించుకుని ఈ మూవీలోని పుష్ప రాజ్‌ను ఏప్రిల్ 7, సాయంత్రం 6.12 గంటలకు పరిచయం చేయబోతున్నట్లు కూడా చిత్ర యూనిట్ ప్రకటించింది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో రూపొందుతోన్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. కన్నడ పిల్ల రష్మిక మందన్నా ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది. మలయాళ హీరో ఫహద్ ఫాసిల్ విలన్‌గా చేస్తున్నాడు. దేవీ సంగీతం అందిస్తున్నాడు. భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న ఈ సినిమా ఆగస్టు 13న రిలీజ్ కానుంది.


Click it and Unblock the Notifications











