అల్లు అర్జున్ ఖాతాలో గొప్ప రికార్డు: ఇండియాలోనే రెండో స్థానం.. తగ్గేదేలే అంటూ దూసుకెళ్తున్నాడుగా!

బడా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కుమారుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా.. యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్, స్టైల్స్ ఇలా అన్నింట్లోనూ రాణిస్తూ టాప్ హీరోగా వెలుగొందుతున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. కెరీర్ ఆరంభంలోనే ఎన్నో విజయాలను అందుకున్న అతడు.. విభిన్నమైన చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. అదే సమయంలో భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా అల్లు అర్జున్ ఓ అరుదైన రికార్డును అందుకున్నాడు. తద్వారా ఇండియాలోనే రెండో స్థానానికి చేరుకున్నాడు. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

పొట్టి బట్టల్లో సెగలు రేపుతున్న మధు శాలిని.. ఎక్కడా తగ్గట్లేదుగా

పుష్పరాజ్‌గా మారిన అల్లు అర్జున్

పుష్పరాజ్‌గా మారిన అల్లు అర్జున్

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తోన్న చిత్రం 'పుష్ప'. పాన్ ఇండియా రేంజ్‌లో రూపొందుతోన్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. కన్నడ పిల్ల రష్మిక మందన్నా ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది. మలయాళ హీరో ఫహద్ ఫాసిల్ విలన్‌గా చేస్తున్నాడు. దేవీ శ్రీ ప్రసాద్ దీనికి సంగీతం అందిస్తున్నాడు. అనసూయ కీలక పాత్రను పోషిస్తోంది.

పొట్టి బట్టలతో రోడ్డెక్కిన పాయల్.. అలా పడుకుని ఫోజులు

‘పుష్ప' కోసం కష్టపడుతోన్న బన్నీ

‘పుష్ప' కోసం కష్టపడుతోన్న బన్నీ

ఇప్పటి వరకూ స్టైలిష్ స్టార్‌గా పేరొందిన అల్లు అర్జున్.. 'పుష్ప' మూవీతో ఐకాన్ స్టార్‌గా మారిపోతున్నాడు. ఇందుకోసం అతడు ఎన్నో సాహసాలు సైతం చేస్తున్నాడు. ఇప్పటికే కొండ ప్రాంతాల్లో లారీ డ్రైవింగ్‌ నేర్చుకున్న అతడు.. రియల్ స్టంట్స్ కూడా చేస్తున్నాడు. అంతేకాదు, చిత్తూరు యాసను కూడా మాట్లాడుతున్నాడు. మరీ ముఖ్యంగా ఈ సినిమాలో అతడు డీ గ్లామర్‌గా కనిపిస్తున్నాడు.

బర్త్ డే బ్యూటీ హాట్ ట్రీట్.. మామూలుగా లేదుగా

‘పుష్ప' ఒకటి కాదు... రెండు పార్ట్స్

‘పుష్ప' ఒకటి కాదు... రెండు పార్ట్స్

ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'పుష్ప' మూవీని రెండు భాగాలుగా విడుదల చేయబోతున్నారని ఇటీవలే ఓ న్యూస్ బయటకు వచ్చింది. దీంతో ఇది దేశ వ్యాప్తంగ చర్చనీయాంశం అయింది. ఇలాంటి సమయంలోనే తాజాగా నిర్మాతల్లో ఒకరైన రవి శంకర్ కూడా ఈ వార్తను ధృవీకరించారు. ఇక, ఇందులో మొదటి భాగం దసరాకు గానీ సంక్రాంతికి గానీ విడుదల కాబోతుందని టాక్.

బ్రా లేకుండా సైడ్ యాంగిల్ లో షాకిచ్చిన షమా సికిందర్

విడుదలకు ముందే రికార్డు క్రియేట్

విడుదలకు ముందే రికార్డు క్రియేట్

పుష్ప సినిమా నుంచి కొద్ది రోజుల క్రితం 'Introducing Pushpa Raj' అనే వీడియోను విడుదల చేశారు. పూర్తి మాస్ ఎలిమెంట్స్‌తో రూపొందిన ఈ వీడియోకు ప్రేక్షకుల నుంచి విపరీతమైన స్పందన వచ్చింది. ఫలితంగా ఇది ఎన్నో రికార్డులను బద్దలు కొట్టేసింది. తద్వారా తెలుగులోనే ఎక్కువ వ్యూస్ సాధించిన టీజర్‌గా నిలిచింది. ఈ మధ్యనే 70 మిలియన్ మైలురాయి దాటింది.

అల్లు అర్జున్ ఖాతాలో గొప్ప రికార్డు

అల్లు అర్జున్ ఖాతాలో గొప్ప రికార్డు

అల్లు అర్జున్ 'పుష్ప' మూవీ టీజర్ తాజాగా మరో అరుదైన రికార్డును బద్దలు కొట్టేసింది. ఇప్పటి వరకూ ఎక్కువ వ్యూస్ అందుకున్న చిత్రాల జాబితాలో సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన 'రోబో 2.O' టీజర్ 72.4 మిలియన్ వ్యూస్‌తో మొదటి స్థానంలో ఉండేది. దాన్ని 'కేజీఎఫ్ చాప్టర్ 2' టీజర్ దాటేసింది. ఇప్పుడు దీన్ని 'పుష్ప' వీడియో అధిగమించి సరికొత్త ఘనతను అందుకుంది.

ఇండియాలోనే రెండో స్థానంలో బన్నీ

ఇండియాలోనే రెండో స్థానంలో బన్నీ

ప్రస్తుతం ఇండియాలో ఎక్కువ వ్యూస్ అందుకున్న టీజర్ల జాబితాలో 'కేజీఎఫ్ చాప్టర్ 2' 191 మిలియన్ వ్యూస్‌తో మొదటి స్థానంలో ఉండగా.. అల్లు అర్జున్ 'పుష్ప' 72.6 మిలియన్ వ్యూస్‌తో రెండో స్థానానికి చేరుకుంది. ఇక, రజినీకాంత్ నటించిన 'రోబో 2.O' టీజర్ 72.4 మిలియన్ వ్యూస్‌తో మూడో స్థానంలో.. విజయ్ 'మాస్టర్' 67.9 మిలియన్ వ్యూస్‌తో నాలుగో స్థానంలో నిలిచాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X