అల్లు ఫ్యామిలీ నుంచి మూడవ నిర్మాత.. ఆ సినిమా కోసం భారీ బడ్జెట్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కువగా వారసులు నటులుగా అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. అయితే నిర్మాతలుగా వచ్చేది మాత్రం చాలా తక్కువమంది అని చెప్పవచ్చు. అది చాలా రిస్క్ తో కూడుకున్న పని అని ప్రొడక్షన్ పైన పెద్దగా ఇంట్రెస్ట్ చూపరు. ఇక అల్లు ఫ్యామిలీ నుంచీ ఇప్పటికే ఇద్దరు హీరోలు పరిచయం అవ్వగా మరొక నిర్మాత పరిచయం కాబోతున్నాడు. అతను మరెవరో కాదు. అల్లు అరవింద్ పెద్ద కొడుకు అల్లు వెంకటేష్. ముద్దుప పేరు అల్లు బాబీ అని అందరికి తెలిసిందే.

ఇక హీరోగా అల్లు అర్జున్ నట వారసత్వాన్ని పాన్ ఇండియా లెవెల్ కు తీసుకు వచ్చాడు. ఆ విషయంలో అల్లు అరవింద్ చాలా సంతృప్తిగా ఉన్నాడు. ఇక చిన్నోడు అల్లు శిరీష్ మాత్రం అనుకున్నంత స్థాయికి రాలేదు. ఇక పెద్ద కుమారుడు బాబీ నటనపై అస్సలు ఇంట్రెస్ట్ చూపలేదు. ఎలాగైనా అతని కంటూ ఒక గుర్తింపు వచ్చేలా చేయాలని అల్లు అరవింద్ సపోర్ట్ చేస్తున్నాడు. నిర్మాతగా ఇంట్రెస్ట్ ఉందని చెప్పడంతో ఒక మంచి ప్రాజెక్ట్ సెట్ చేయించాడు.

 Allu bobby investing big amount on upcoming movie

అల్లు రామలింగయ్య, అల్లు అరవింద్ అనంతరం నిర్మాతగా బాబీ స్పెషల్ ప్లాన్స్ తో వెళుతున్నాడు. అల్లు బాబీ ఇప్పుడు ఒక మెగా హీరోపై గట్టిగానే పెట్టుబడి పెడుతున్నాడు. ఆ మెగా హీరో మరెవరో కాదు హీరో వరుణ్ తేజ్. కొత్త దర్శకుడు కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'గని' సినిమాను బిగ్ బడ్జెట్ తోనే నిర్మిస్తున్నారు. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీ కోసం 25కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ నెవర్ బిఫోర్ అనేలా ఉంటాయట.

వరుణ్ తేజ్ విదేశాలకు వెళ్లి స్పెషల్ గా బాక్సింగ్ కోచింగ్ కూడా తీసుకున్నాడు. ఇక సినిమాలో కన్నడ స్టార్ ఉపేంద్ర కూడా ఒక స్పెషల్ పాత్రలో నటిస్తున్నాడు. సినిమాతో ఎలాగైనా బాక్సాఫీస్ హిట్ అందుకోవాలని అల్లు బాబీ ఖర్చుకు వెనుకాడకుండా సినిమాని నిర్మిస్తున్నారు. మరి బాబీ అల్లు అరవింద్ స్థాయికి తగ్గట్లుగా నిర్మాతగా గుర్తింపు అందుకుంటాడో లేదో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X