మెగా, అల్లు కుటుంబాల మధ్య విబేధాలకు కారణం అదేనా?
Allu Family Vs Mega Family Controversy: మెగా వర్సెస్ అల్లు వివాదం రోజురోజుకి మరింత ముదురుతోందా? అంటే.. పైకి అంతా బాగానే ఉన్నా.. లోలోపల మాత్రం ఇరు కుటుంబాలపై నానాటికీ దూరం పెరుగుతున్నట్టే కనిపిస్తోంది. ఏపీ ఎన్నికల సమయంలో మొదలైన ఈ కోల్డ్ వార్.. రోజురోజుకూ పెరుగుతున్న కనిపిస్తోంది. ఇరు ఫ్యామిలీలు తగ్గేదేలే అన్నట్టు, ఎక్కడా కూడా కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి కనిపించట్లేదని టాక్. అయితే.. ఈ గ్యాప్ అన్‌వాంటెడ్‌గా వచ్చింది కాదని, ఓ ప్లాన్ ప్రకారమే జరుగుతున్నదని ప్రచారం కూడా జరుగుతోంది. ఇన్నాళ్లూ తెలుగు సినిమా పరిశ్రమలో మెగా - అల్లు ఫ్యామిలీలను వేర్వేరుగా ఎన్నాడు చూడలేదు. కానీ ఇప్పుడు ఆ మాత్రం పరిస్థితి మారిందంట. ఇక ఫ్యాన్స్ విషయానికి వస్తే.. మెగా, అల్లు ఫ్యాన్స్ మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఏర్పడింది. ఇంతకీ ఇరు కుటుంబాల మధ్య ఏం జరుగుతోంది ? ఎందుకీ మాటల తూటాలు? మీరు కూడా ఓ లూక్కేయండి.
వాస్తవానికి ఇరు కుటుంబాల మధ్య సంబంధాలు ఎలా ఉన్నాయో తెలియదు గానీ, సోషల్ మీడియాలో మాత్రం ఆ గ్యాప్ సెంటీ మీటర్ ఉంటే.. కిలో మీటర్ ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది. అయితే.. ఈ ప్రచారానికి కూడా కారణాలు లేకపోలేదు. ఇండస్ట్రీలో ఏ కార్యక్రమం జరిగిన చిరంజీవి ఎక్కడుంటే.. అల్లు అరవింద్ అక్కడుండే వారు. కానీ, ఇటీవల కాలంలో ఆ సీన్ కనిపించడం లేదు. మెగా ఫ్యామిలీలో ఏ పార్టీ లేదా ఏ చిన్న సెలబ్రేషన్స్ జరిగినా.. కచ్చితంగా అల్లు వారి ఫ్యామిలీ అటెంట్ కావాల్సిందే.

ప్రధాన కారణమదేనా ?
ఇటీవలీ ఏపీ ఎన్నికల్లో జనసేనాని పవన్ కల్యాణ్ టీడీపీ, బీజేపీతో కలిసి బరిలో దిగిన విషయం తెలిసిందే. కానీ, అల్లు అర్జున్ ఈ విషయాన్ని పట్టించుకోకుండా.. తన అభిమాని, నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డి తరుపున ప్రచారం చేపట్టారు. ఈ విషయం మెగా ఫ్యాన్స్‌కు అస్సలు నచ్చలేదు. ఈ సమయంలోనే "మాతో ఉంటూ ప్రత్యర్థులకు పనిచేసేవాడు మావాడైనా పరాయివాడే.. మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే.." అంటూ నాగబాబు ట్వీట్ చేయడం వైరల్ గా మారింది. ఇది అల్లు అర్జున్‌ను టార్గెట్ చేస్తూ ట్వీట్ చేశారని పెద్ద ఎత్తున ప్రచారం జరగడంతో నాగబాబు.. తన ట్విట్టర్ అకౌంట్‌ను డిలీట్ చేశారు. ఈ చిరు.. నాగబాబు మీద ఫైర్ అయ్యారనే ప్రచారం కూడా జరిగింది. కాస్త గొడవ సర్దుమనిగిందని అందరూ భావించారు
ప్రమాణ స్వీకారానికి అల్లు ఫ్యామిలీ దూరం..
కానీ, పవన్ కల్యాణ్ గెలిచిన తర్వాత అల్లు ఫ్యామిలీ మెగా సెలబ్రెషన్స్ లో అల్లు ఫ్యామిలీ అస్సలు కనిపించలేదు. ఎన్నికల్లో పవన్ కల్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎంగా గెలిచి ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఈ పొలిటికల్ ఈవెంట్ కు ఎంతో మంది సీని, రాజకీయ ప్రముఖులు హాజరైనా అల్లు వారి కుటుంబం నుంచి ఒక్కరు కూడా రాలేదు. ఇలా అప్పటి నుంచి ఇరు ఫ్యామిలీ మధ్య గ్యాప్ నడుస్తూనే ఉందని టాక్.

బన్నీకి పవన్ కౌంటర్
ఏపీ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ ఘన విజయం సాధించి డిప్యూటీ సీఎం అయ్యారు. ఇటీవల ఆయన ఓ కార్యక్రమంలో సినిమా ఇండస్ట్రీ గురించి మాట్లాడుతూ.. సినిమాల ప్రభావం ఎంత ఉంటుందనీ అందరికీ తెలుసు. గతంలో సినిమాల్లోని హీరోలు అడవులను కాపాడే వారు.. కానీ నేడు అడవులను నరికి స్మగ్లింగ్ నరకడం ఫ్యాషన్ అయిపోయిందని పవన్ అన్నారు. ఈ వ్యాఖ్యలు అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాను ఉద్దేశించే చేశారని, ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ వైసీపీకి మద్దతివ్వడాన్ని పవన్ మర్చిపోలేదని పవన్ ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు.
బన్నీ ట్వీట్
అలాగే.. తాజాగా చిరంజీవి జన్మదిన సందర్భంగా అల్లు అర్జున్.. 'మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే మెగాస్టార్ చిరంజీవి'అని ట్వీట్ చేశారు. కానీ, గతంలో ఎప్పుడూ ట్విట్ట్ చేసిన మావయ్యా అని సంబోధించేవారు. కానీ, ఆ సంభోదన లేదు. ఏదో విష్ చేశామా? లేదా అన్నట్టు ట్విట్ చేశారంటూ.. మెగా అభిమానులు ఫైర్ అవుతున్నారు అల్లుడు బన్నీపై .
ఫ్యాన్స్ ట్రోల్స్
ఇక సోషల్ మీడియాలో ఫ్యాన్స్ వార్ మాత్రం మామూలుగా లేదు. మెగా, అల్లు ఫ్యాన్స్ మధ్య ఏ సోషల్ మీడియా వేదికైనా.. పోటాపోటీగా కౌంటర్లు వేసుకుంటున్నారు. ఇటీవల చిరు బర్త్ డే సందర్భంగా ఇంద్ర రీరిలీజ్ అయినా విషయం తెలిసిందే. ఈ సందర్భంగా థియేటర్లలో అల్లు అర్జున్ పేరు మార్మోగింది. చిరంజీవికి శివాజీ ఎదురు తిరిగే సీన్ వచ్చినప్పుడు బన్నీ బన్నీ అని మెగా ఫ్యాన్స్ చేసిన రచ్చ మామూలుగా లేదు. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట్లో తెగ వైరల్ గా మారుతున్నాయి.

నాటి నుండి బన్నీకి అవమానం..
ఈ వివాదం కొత్తేమి కాదు. మొదటి నుంచి బన్నీకి, చెర్రీకి పడదని టాక్. దువ్వాడ జగన్నాథం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అయితే.. పవన్ ఫ్యాన్స్ లో బన్నీకి వార్ జరిగింది. పవన్ కళ్యాణ్ పేరు చెప్పాలని గోల చేయడంతో అల్లు అర్జున్ సీరియస్ అయ్యాడు. నేను చెప్పను బ్రదర్స్ అని అల్లు అర్జున్ అనడంతో పవన్ ఫ్యాన్స్ కోపం కట్టలు తెంచుకుంది. అప్పటి నుంచి అల్లు అర్జున్ పై ఇలాంటి ఎటాక్స్ తరుచూ జరుగుతూనే ఉన్నాయి. మెగా ఫ్యామిలీకి సంబంధించిన ఏ ఈవెంట్ కు వెళ్లినా.. అక్కడ మెగా ఫ్యాన్స్ తో బన్నీకి అవమానం జరుగుతోందని చెప్పాలి.
మెగా లెగసీ అల్లు ఫ్యామిలీతోనే..
సైరా నరసింహా రెడ్డి ప్రీరిలీజ్ ఈవెంట్‌లో కూడాఅల్లు అరవింద్ కు చేదు అనుభవం తప్పలేదు. మైక్ పట్టుకోగానే వద్దు వద్దంటూ మెగా ఫ్యాన్స్ నానా రచ్చ చేశారు. ఇలాంటి చేదు అనుభవాల వల్లనే మెగా- అల్లు ఫ్యామిలీల మధ్య గ్యాప్ పెరిగినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే మెగా కాంపౌండ్ నుంచి అల్లు ఫ్యామిలీ బయటకు వచ్చిందనే టాక్ నడుస్తోంది. మరోవైపు.. చిరు ఫ్యామిలీకి మెగా క్రేజ్ రావడానికి తమ కుటుంబమే కారణమంటూ.. తమ ఇంటి ఆడబిడ్డను పెళ్లి చేసుకున్న తరువాతే చిరంజీవి మెగాస్టార్ గా ఎదిగారనీ, ఆ మెగా లెగసీకి తామ కుటుంబమేనని అల్లు ఫ్యామిలీ భావిస్తుందని ప్రచారం మరోవైపు.
ఎంత దూరమైనా వస్తా..
తాజాగా అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వివాదానికి కేరాఫ్‌గా నిలిచాయి. ఇటీవల విలక్షణ నటుడు రావు రమేష్ లీడ్ రోల్ నటించిన 'మారుతీనగర్ సుబ్రహ్మణ్యం' ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిధిగా వచ్చిన అల్లు అర్జున్ మాట్లాతుడూ.. " మై డియర్ ఫ్యాన్స్.. మీరే నా ఆర్మీ, నాకు ఫ్యాన్స్ అంటే పిచ్చి. హీరోని చూసి చాలా మంది ఫ్యాన్స్ అవుతారు. కానీ, నేను మాత్రం నా ఫ్యాన్స్‌ని చూసి నేను హీరోనయ్యా. నా నుంచి కొత్త సినిమా రాక మూడేళ్లయినా.. మీరు చూపించే ప్రేమ అస్సలు తగ్గలే. పుష్ప 2 క్లైమ్యాక్స్ కోసం చాలా చాలా కష్టపడ్డాను. తాను ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్కు వచ్చానంటే.. సుకుమార్ గారి భార్య తబిత కారణమన్నారు.
ఆమె పిలిచిన తరువాత కాదనలేకపోయాననీ, ఎందుకంటే ఇష్టమైనోళ్లకి కోసం అండగా నిలబడుతానని అన్నారు. 'మన అనుకున్న వాళ్ల కోసం ఎంత వరకైనా వెళ్తా.. నా మనసుకు నచ్చితేనే ఎంత దూరమైనా వస్తా.. ఈ విషయం మీ అందరికీ తెలుసు అంటూ.. 'అల్లు అర్జున్ షాకింగ్ కామెంట్స్ చేశారు. దీంతో అక్కడున్న బన్నీ ఫ్యాన్స్ అంతా పెద్దగా కేకలు పెట్టారు. ఎన్నికలు ముగిసిన తరువాత మొదటిసారి బన్ని ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారాయి. ప్రస్తుతం ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంతేకాకుండా మెగా ఫ్యాన్స్ బన్నీ మాటలను తెగ ట్రోల్స్ చేస్తున్నారు.
సొంత బ్రాండ్ కోసం ఆరాటం..
ఏదిఏమైనా.. మెగా కాంపౌండ్ నుంచి బయటపడి.. అల్లు బ్రాండ్ నిలబెట్టాలనే ఆలోచనలో అల్లు అర్జున్ ఉన్నారని మరికొందరని టాక్. ఈ క్రమంలోనే ఆయన ఇన్ డైరెక్ట్ గా షాకింగ్ కామెంట్స్ చేస్తారని మూవీ లవర్స్ అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ తన బ్రాండ్ వాల్యూను పెంచుకోవాడానికి శత విధాలా ప్రయత్నిస్తున్నారని, భవిష్యత్తులో కూడా ఈ వ్యవహారం ఇలానే ఉండబోతుందనేది టాక్. ఇందులో భాగంగానే అల్లు అరవింద్ కూడా ఆ వైపు అడుగులేస్తున్నారంట. తన ఓన్ బ్రాండ్ డెవలప్మెంట్ కోసమే సొంతంగా ఓటీటీ ప్లాట్ ఫామ్ ను స్టార్ట్ చేయడం, అల్లు పేరిట స్టూడియో నిర్మించారని, అల్లు ఫ్యామిలీ పక్కా ప్లాన్ ప్రకారమే అడుగులేస్తున్నట్టు సమాచారం. మరి బ్రాండ్ వార్ ఎక్కడ వరకు వెళ్తుంది.. మరీ ఎక్కడ ఫుల్ స్టాప్ పడుతుందో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











