అల్లు శిరీష్ అదిరిపోయే పంచ్.. దెబ్బకు నెటిజన్ షాక్
అల్లు శిరీష్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నెటిజన్ల ప్రశ్నలకు సమాధానమిచ్చే అల్లు శిరీష్.. అదిరిపోయే పంచ్‌లు కూడా వేస్తుంటాడు. ఈ మేరకు గతంలో ఎన్నో సార్లు అల్లు శిరీష్ నెటిజన్లకు ఇచ్చిన రిప్లైలు ఎంతో వైరల్ అయ్యాయి. అల్లు శిరీష్ ప్రస్తుతం ఒంటరిగానే ఉంటున్నాడన్న సంగతి తెలిసిందే. కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ విధించడంతో అల్లు శిరీష్ ఒంటరిగానే కాలాన్ని గడుపుతున్నాడు.
అయితే ఒంటరిగా ఉన్న అల్లు శిరీష్.. పడరాని పాట్లే పడుతున్నాడు. దోమలను వెంటాడుతూ, నెట్‌ఫ్లిక్స్‌లో సినిమాలు చూసుకుంటూ తెగ బోర్ కొడుతోందని తెలిపాడు. ఒంటరిగా క్రికెట్ ఆడుతూ కాలాన్ని గడిపేస్తున్నాడు. తాజాగా మరోసారి లాక్ డౌన్‌ను పొడిగించడంపై అల్లు శిరీష్ స్పందించాడు. ఈ మేరకు ఓ నెటిజన్‌కు అదిరిపోయే సెటైర్ వేశాడు.

మే 29 వరకు లాక్‌డౌన్‌ను పొడిగించారని, నాకు తెలిసి హైద్రాబాద్ సిటీ అంతా కలిసి తన పుట్టినరోజు (మే 30)ను ఘనంగా సెలబ్రేట్ చేస్తుందని ఆశిస్తున్నానని తెలిపాడు. ఈ మధ్య అల్లు శిరీష్ చేసే ప్రతీ పోస్ట్‌లో కొంత మంది నెట్‌ఫ్లిక్స్ అకౌంట్ డిటెయిల్స్ ఇవ్వమని కోరుతున్నారు. తాజాగా అలాంటి ట్వీట్‌కు సమాధానమిస్తూ.. తీసుకో బ్రో యూజర్ నేమ్ దయ, పాస్వర్డ్ పోలీస్ ఎంజాయ్ చేసుకో అన్నట్టు ట్వీట్ చేశాడు. ఇక అల్లు శిరీష్ సినిమాల విషయానికొస్తే.. చివరగా ABCD చిత్రంతో పలకరించాడు. త్వరలోనే కొత్త ప్రాజెక్ట్ ప్రకటిస్తానని చెప్పినా.. కరోనా రాకతో అంతా తారుమారైంది.


Click it and Unblock the Notifications











