ప్లాప్ సినిమానే ఇష్టమంటున్న అల్లు శిరీష్.. అన్నయ్యకు అప్పటి నుంచే అభిమానిగా!
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ఆర్య చిత్రం మంచి విజయం సాధించింది. దర్శకుడు సుకుమార్ అప్పటివరకు ఉన్న ప్రేమ కథా చిత్రాల ట్రెండుకు భిన్నంగా ఈ చిత్రంలో లవ్ స్టోరీని ఆవిష్కరించారు. నటన పరంగా బన్నీని మరో స్థాయికి చేర్చిన చిత్రం ఇది. ఈ చిత్రానికి సీక్వల్ గా ఆర్య2 తెరకెక్కించారు. కానీ ఆర్య 2 నిరాశపరిచింది. అయినా కూడా తనకు ఆర్య కంటే ఆర్య2నే ఇష్టం అని అల్లు శిరీష్ అంటున్నారు.
ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్ట్ పెట్టాడు. నేను సినిమాలు చూసి ఏడవడం చాలా తక్కువ. కానీ ఆర్య 2 చిత్రంలో బన్నీ గొంతుపై కత్తి పెట్టుకునే సన్నివేశం చూసి కళ్ళు చెమ్మగిల్లాయి. అప్పటి నుంచి తాను అన్నయ్యకు అభిమానిగా మారిపోయానని శిరీష్ తెలిపాడు. ప్రేమ, స్నేహం, త్యాగానికి సరికొత్త అర్థం చెప్పే చిత్రం ఆర్య2 అని శిరీష్ అభిప్రాయం పడ్డాడు.

2009 లో ఆర్య 2 చిత్రం విడుదలైంది. బన్నీ సరసన కాజల్ హీరోయిన్ గా నటించింది. నవదీప్, శ్రద్ధ దాస్ కీలక పాత్రల్లో నటించారు. ఆర్య, ఆర్య 2 రెండు చిత్రాలకు దేవిశ్రీ ప్రసాదే సంగీత దర్శకుడు. ఈ చిత్రంలో బన్నీ చేసిన డాన్సులు అప్పట్లో సంచలనం. సుకుమార్ ఆర్య 2 రూపంలో అద్భుతమైన చిత్రాన్ని అందించారని అభిప్రాయపడ్డాడు.


Click it and Unblock the Notifications











