డబ్బా కొట్టడాలొద్దు.. హీరో పేరెత్తకుండా అల్లు శిరీష్‌ షాకింగ్ కామెంట్స్!

సినీ పరిశ్రమలో ఉన్న వారు అభిమానులతో ఇంటరాక్ట్ కావడం అత్యవసరం. అలాగే తమను తాము ప్రమోట్ చేసుకోవడానికి నిత్యం లైమ్ లైట్‌లో ఉండాల్సిందే. గతంలో ఫిల్మ్ మేగజైన్స్ , పత్రికల ద్వారా సినీ నటులు తమ అభిప్రాయాలను పంచుకునేవారు. ఇంకొందరు ఫ్యాన్ మెయిల్స్ పేరిట ఉత్తరాలు పంపేవారు. ప్రస్తుతం సోషల్ మీడియా యుగంలో హీరోలకు సొంత పీఆర్ టీమ్‌లు ఉన్నాయి. హీరోలకు దుష్ప్రచారం జరగకుండా చూసుకోవడంతో పాటు ప్రమోషన్ చేయడం ఈ టీమ్స్ బాధ్యత. ఈ నేపథ్యంలో హీరోల సొంత డబ్బాపై యువ హీరో సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆ వివరాల్లోకి వెళితే..

నటీనటులు తమ అభిమానులతో ఇంటరాక్ట్ కావడానికి గాను సోషల్ మీడియాలో ఖాతాలను ఓపెన్ చేస్తున్నారు. ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాలలో చురుగ్గా ఉంటున్నారు. సినిమా సంగతులతో పాటు వ్యక్తిగత వివరాలను ఎప్పటికప్పుడు పంచుకుంటూ ఉంటారు. ఈ విధానంలో తమ సినిమాలను కూడా ప్రమోట్ చేసుకోవచ్చన్నది వారి ఆలోచన. తమ ఖాతాలను నేరుగా వాడే వారు కొందరైతే , సెపరేట్‌గా టీమ్‌లను పెట్టి మేనేజ్ చేసే వారు మరికొందరు.

Allu Sirish made sensational comments on Tollywood heroes and their PR Team

హీరోల కోసం సొంత పీఆర్ టీమ్‌లు పనిచేస్తుంటాయి. హీరోలపై ఈగ వాలనివ్వకపోవడంతో పాటు సమయానికి తగినట్లుగా పోస్ట్‌లు, ఫోటోలను షేర్ చేస్తుంటారు. సినిమాల రిలీజ్‌ల సమయంలో ఈ టీమ్స్ హడావుడి ఓ రేంజ్‌లో ఉంటుంది. బాక్సాఫీస్ రిపోర్టులు, కలెక్షన్ల వివరాలు, ఫోటోలు, వీడియోలు, ట్రైలర్లు సమస్తం ఈ బృందాల పనే. అయితే ఈ పీఆర్ టీమ్‌ల ఓవరాక్షన్ వల్ల కొన్నిసార్లు సదరు హీరోలకు డ్యామేజ్ జరుగుతుంది. ఏమీ లేకపోయినా ఏదో ఉందని ప్రచారం చేయడం, అతి .. కొన్నిసార్లు విమర్శలు తెచ్చిపెట్టింది. తెలుగు హీరోలలో అల్లు అర్జున్‌ పీఆర్ టీమ్ చాలా బలమైనదని ఫిలింనగర్ టాక్.

ఈ క్రమంలో హీరోల డబ్బా కొట్టుడుపై సంచలన వ్యాఖ్యలు చేశారు యువ హీరో అల్లు శిరీష్ . మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చి పదేళ్లు కావొస్తున్నా ఇప్పటి వరకు ఆయనకు సరైన హిట్ లేదు. మనోడు ఎంతగానో కష్టపడుతున్నా ఫలితం మాత్రం దక్కడం లేదు. ఎన్నో ఆశలు పెట్టుకున్న బడ్డీ మూవీ కూడా అల్లు శిరీష్‌ని బాగా డిజప్పాయింట్ చేసింది. ప్రస్తుతం స్టోరీల డిస్కషన్‌లో ఉన్న శిరీష్.. మరో క్రేజీ ప్రాజెక్ట్‌ను ఓకే చేయనున్నారు.

కొద్దిరోజుల క్రితం ఓ ఛానెల్‌తో ఆయన మాట్లాడుతూ.. హీరోలకు సొంత పీఆర్ టీమ్‌లు ఉండటంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రేక్షకులు మనల్ని గుర్తుపెట్టుకోవాలంటే సొంతంగా పీఆర్ టీంలు ఉండనక్కర్లేదన్నారు. దానికి బదులు వరుసగా సినిమాలు చేస్తూ పోతే చాలని .. ఉదాహరణకు ప్రభాస్ విషయానికి వస్తే, ఆయన ప్రజంట్ నెంబర్ 1 హీరో అని తెలిపారు. ప్రభాస్ అన్న పది నెలలకో సినిమా ద్వారా ప్రేక్షకులను పలకరిస్తున్నారని.. పాన్ ఇండియా రేంజ్ హీరో అయినప్పటికీ ఎలాంటి హడావుడి చేయరని, ఫంక్షన్లకు కూడా రారని అల్లు శిరీష్ అన్నారు. అయితే చిన్న సినిమాలను బాగా ఎంకరేజ్ చేస్తారని .. తనకు తెలిసి ప్రభాస్‌కి సొంత పీఆర్ టీమ్ లేదని ఆయన తెలిపారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. శిరీష్ వ్యాఖ్యలు ఏ హీరో గురించో అంటూ నెటిజన్లు డిస్కష్ చేస్తున్నారు.

More from Filmibeat

Read more about: allu sirish tollywood prabhas
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X