ఒంటరిగా అల్లు శిరీష్ పాట్లు.. వీడియో వైరల్
అల్లు శిరీష్ ప్రస్తుతం ఒంటరిగానే ఉంటున్నాడన్న సంగతి తెలిసిందే. కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ విధించడంతో అల్లు శిరీష్ ఒంటరిగానే కాలాన్ని గడుపుతున్నాడు. అయితే ఒంటరిగా ఉన్న అల్లు శిరీష్.. పడరాని పాట్లే పడుతున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు తాను ఈ క్వారంటైన్‌లో ఎలా గడుపుతున్నాడో వివరిస్తూ వీడియోలు షేర్ చేస్తున్నాడు. ఇది వరకు షేర్ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో ఎంతగా వైరల్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
అల్లు ఫ్యామిలీలో శిరీష్ ఒక్కడే సపరేట్ ఉంటున్నట్టు తెలుస్తోంది. జనతా కర్ఫ్యూ నాడు అల్లు ఫ్యామిలీ మొత్తం బయటకు వచ్చిన కరతాళ ధ్వనులు చేసింది. అందులో అల్లు శిరీష్ మాత్రం కనిపించలేదు. మరోసారి దీపాలు వెలిగించిన సమయంలోనూ అల్లు శిరీష్ ఒంటరిగానే ఉన్నాడు. తాజాగా అల్లు శిరీష్ షేర్ చేసిన వీడియోను చూస్తే.. ఎన్ని కష్టాలు పడుతున్నాడో అర్థమవుతోంది.

శనివారం రాత్రి ఎలా గడిపాడో ఓ వీడియో రూపంలో సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దోమలను వెంటాడుతూ, నెట్‌ఫ్లిక్స్‌లో సినిమాలు చూసుకుంటూ తెగ బోర్ కొడుతోందని తెలిపాడు. ఈ వీడియోను చూసిన నెటిజన్స్ త్వరగా పెళ్లి చేసుకోమని సలహా ఇస్తున్నారు. మరికొంత మంది నెట్‌ఫ్లిక్స్ అకౌంట్ డిటెయిల్స్ ఇవ్వమని కోరుతున్నారు. ఇక అల్లు శిరీష్ సినిమాల విషయానికొస్తే.. చివరగా ABCD చిత్రంతో పలకరించాడు. త్వరలోనే కొత్త ప్రాజెక్ట్ ప్రకటిస్తానని చెప్పినా.. కరోనా రాకతో అంతా తారుమారైంది.


Click it and Unblock the Notifications











