RamCharan రామ్ చరణ్ నిజస్వరూపం ఎలాంటిదో చెప్పిన అల్లు శిరీష్... మనసులో ఇంత దాచుకున్నాడా?

పాన్ ఇండియా స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఆయన ఎలా ఉంటాడు అనేది కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. బయట కూడా ఆయన సైలెంటుగా ఉంటూ వినయంగా విదేయతగా ఉంటారనే విషయం తెలిసిందే. అయితే రామ్ చరణ్ ఇంట్లో ఉన్నప్పుడు ఎలా ఉంటాడో అల్లు శిరీష్ చెప్పుకువచ్చాడు. ఆయన అసలు నిజ స్వరూపం ఇది అంటూ మాట్లాడాడు అల్లు శిరీష్. దీంతో ఆ వీడియో వైరల్ గా మారింది. పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూసేద్దాం.

మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ ఎలా ఉంటారో అందరికీ తెలిసిందే. తండ్రికి తగ్గ తనయుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు చెర్రీ. ఎక్కడ కోపం ప్రదర్శించకుండా... ఎంతో వినయంగా పెద్దలంటే గౌరవంగా మెలుగుతాడనే విషయం తెలిసిందే. ఎంతో మంది ప్రముకులు చెర్రీ గురించి గొప్పగా మాట్లాడుతుంటారు. ఆఖరికి జక్కన్న కూడా ఎన్నో సార్లు చరణ్ అంటే ఇష్టమని చెప్పుకువచ్చాడు. చిరంజీవి ఫ్యాన్ అయినప్పటికీ.. నాకు మాత్రం నా హీరో చరణ్ అంటే ఇష్టం అని ఎన్నోసార్లు వెల్లడించారు జక్కన్న.

Allu Sirish says what Mega PowerStar Ram Charan looks like in real life Video Goes Viral

ఇక మొన్నటికి మొన్న భార్య ఉపాసన కాళ్లు నొక్కుతూ.. ఓ వీడియో హల్ చల్ చేసింది. ఇక ఆ వీడియో చూసిన నెటిజన్స్... మాకు చరణ్ లాంటి హాస్బెండ్ కావాలంటూ కామెంట్స్ పెట్టారు. భార్యను అలా చూసుకునేవాడు కావాలి అంటూ చెప్పుకువచ్చారు. అయితే ఇదంతా ఇలా ఉంటే.. చెర్రీ గురించి అల్లు శిరీష్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. చెర్రీ మామూలు వ్యక్తి కాదంటూ చెప్పుకువచ్చాడు అల్లు శిరీష్.

మెగా ఫ్యామిలీలో ఇప్పటికే చాలా మంది హీరోలు ఇండస్ట్రీకి వచ్చారు. రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, అల్లు అర్జున్, అల్లు శిరీష్ ఇలా చాలా మంది యువ హీరోలు ఇండస్ట్రీకి వచ్చి సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. అయితే వీరు చిన్నప్పుడు కలిసిమెలసి పెరిగేవారు. అయితే అల్లు శిరీష్ ఓ ప్రోగ్రామ్ లో పాల్గొనగా.. చిన్నప్పటి సంగతుల గురించి అడిగాడు యాంకర్ ప్రదీప్. దీంతో రామ్ చరణ్ గురించి షాకింగ్ విషయాలు చెప్పాడు అల్లు శిరీష్.

Allu Sirish says what Mega PowerStar Ram Charan looks like in real life Video Goes Viral

అల్లు శిరీష్ మాట్లాడుతూ... మా ఫ్యామిలీలో ఎక్కువగా అల్లరి చేసేది రామ్ చరణ్. కాకపోతే అలా కనిపించడు. ఎప్పుడు బుద్ధిమంతుడిలా ఉండి చేసేది సైలెంటుగా చేస్తాడు. కనిపించే సౌండ్ నాది. నిజంగా మా ఫ్యామిలీలో బుద్ది మంతుడు అంటే సాయి ధరమ్ తేజ్. వాడే దొరికిపోయి.. వాడే పెద్దలకు చెప్పేస్తాడు. ఇలా చేశాం పెద్దమ్మ.. పెద్దనాన్న అంటూ చెప్పేస్తాడు. వాడిని మా గ్యాంగ్ లో చేర్చుకోవాలంటే భయం. ఎక్కడ దొరికిపోతామో.. ఇంట్లో వెళ్లి చెప్పేస్తాడో అని భయం ఉండేది.. అంటూ చెప్పుకువచ్చాడు.

ఇక ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రామ్ చరణ్ ఫ్యాన్స్ దీనిని ట్రెండ్ చేస్తున్నారు. చరణ్ అన్నతో మామూలుగా ఉండదు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరోవైపు సాయి ధరమ్ తేజ్ గురించి మాత్రం పాపం అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇక రామ్ చరణ్ విషయానికి వస్తే.. శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్, బుచ్చిబాబు దర్శకత్వంలో ఆర్సీ 16 సినిమాలు చేస్తున్నాడు. ఇక ఆర్సీ 16 సినిమా పేరు పెద్ది అని ఖరారు అయినట్లు నెట్టింట్లో వైరల్ గా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X