ఆన్‌లైన్ క్లాస్‌లో అల్లు వారబ్బాయ్.. పడరాని పాట్లు పడుతున్నాడు!
అల్లు వారబ్బాయ్ శిరీష్.. సినిమాల్లో కంటే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటాడు. సోషల్ మీడియాలో పంచ్‌లు, సెటైర్స్, కామెడీ అన్నీ బాగానే చేస్తాడు. నెటిజన్లకు ఇచ్చే కౌంటర్స్ అప్పుడప్పుడు తెగ వైరల్ అవుతాయి. ఈ లాక్ డౌన్ సమయంలో అల్లు శిరీష్ ఎన్ని కష్టాలు పడ్డాడో స్వయంగా వివరించాడు. లాక్ డౌన్ కారణంగా ఒంటరిగా ఉండాల్సి రావడంతో కుర్రాడు దెబ్బకు చిక్కిపోయాడు.
క్వారంటైన్‌లో ఉంటూ తినడం, పడుకోవడం, ఆడుకోవడం చేసి చేసి బోర్ కొట్టిందని సోషల్ మీడియా ద్వారా అభిమానులకు చెప్పుకొచ్చాడు. మధ్యలో అల్లు శిరీష్ బర్త్ డే రావడం, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి సెలెబ్రేట్ చేయడం, ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ కావడం అందరికీ తెలిసిందే. అల్లు శిరీష్ ప్రస్తుతం ఆన్ లైన్ క్లాసులో బిజీగా ఉన్నాడు. అల్లు శిరీష్ పోజులను చూసి పడరాని పాట్లు పడుతున్నాడే అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

ప్రస్తుతం వ్యవస్థ అంతా ఆన్‌లైన్ పైనే ఆధారపడి ఉంది. కరోనా విజృంభణ తగ్గకపోవడంతో అందరూ ఆన్ లైన్‌నే ఆశ్రయిస్తున్నారు. ఇక విద్యా రంగంలోనూ ఆన్ లైన్ విధానం విస్తృతంగా చొచ్చుకువచ్చింది. ఇప్పటికే కొన్ని ప్రైవేట్ విద్యా సంస్థలు ఆన్‌లైన్ విద్యను బోధిస్తున్నాయి. అయితే ఆన్ లైన్‌లో క్లాసులు వింటే ఎలా ఉంటుంది? ఏం జరుగుతుంది? అని అల్లు శిరీష్ సెటైరికల్‌గా చెప్పుకొచ్చాడు.
ఆన్ లైన్ క్లాస్‌లో తొమ్మిది దశలుంటాయని చెబుతూ ఓ ఫోటోను షేర్ చేశాడు. అందులో నిద్రపోతున్నట్టుగా, శ్రద్దగా వింటున్నట్టుగా, ఏం అర్థం కాన్నట్టుగా ఉన్న ఫోటోలను షేర్ చేశాడు. ప్రస్తుతం ఇవి తెగ వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











